Best Web Hosting Provider In India 2024
The First Omen OTT Release: హారర్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చే సినిమాలకు కచ్చితంగా మంచి అటెన్షన్ ఉంటుంది. భయం అనేది మనుషుల ప్రధాన ఎమోషన్. అందుకే దీన్ని బేస్ చేసుకునే హారర్ సినిమాలకు మంచి గిరాకీ ఉంటుంది. అవి మినిమమ్ గ్యారెంటీ సినిమాలుగా కూడా పరిగణించబడతాయి. హాలీవుడ్‌లో అనేక రకాల హారర్ థ్రిల్లర్ సినిమాలు, అందులో ఫ్రాంఛైజీలు అంటూ చాలానే వచ్చాయి.
ఒమెన్ ఫ్రాంఛైజీ
ది నన్ ఫ్రాంఛైజీ, కంజూరింగ్ ఫ్రాంఛైజీ, ఇన్సీడియస్ సిరీస్, గ్రడ్జ్ సిరీస్, ఈవిల్ డెడ్ ఫ్రాంఛైజీ ఇలా ఎన్నో మూవీ సిరీస్‌లు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. అందులో దేని ప్రత్యేకత దానిదే. వీటితోపాటు చెప్పుకునే మరో ఫ్రాంఛైజీ ది ఒమెన్ (The Omen Franchise). ఇప్పటివరకు ఈ సిరీస్‌లో ఐదు సినిమాలు వచ్చాయి. ది ఒమెన్ టైటిల్‌తో 1976లో మొదటి సినిమా విడుదలైంది. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఆరో చిత్రంగా
అనంతరం 1978లో డామెయిన్- ఒమెన్ 2, 1981లో ది ఫైనల్ కాన్‌ఫ్లిక్ట్ (ఒమెన్ 3), 1991లో ఒమెన్ 4- ది అవేక్‌నింగ్, 2006లో చివరిగా ఒమెన్ 5: ది అబోమినేషన్ వచ్చాయి. ఈ ఫ్రాంఛైజీ గురించి ఎక్కువగా ప్రేక్షకులకు తెలియనప్పటికీ భయపెట్టడంలో ఇవి బాగా పాపులారిటీ తెచ్చుకున్నాయి. ఇప్పుడు దీంట్లో ఆరో చిత్రంగా వస్తుందే ది ఫస్ట్ ఒమెన్ (The First Omen Movie).
తొలి మూవీకి ప్రీక్వెల్
ఈ ఆరో సినిమా ఈ సిరీస్‌లో మొదటగా 1976లో వచ్చిన ది ఒమెన్‌కు ప్రీక్వెల్. అంటే ది ఒమెన్ సినిమా కథ కంటే ముందుగా జరిగిన నేపథ్యంతో ది ఫస్ట్ ఒమెన్ తెరకెక్కించారు. అందుకే టైటిల్‌లో ఫస్ట్ ఒమెన్ అని పేరు పెట్టారు. టైటిల్‌ను బట్టే సినిమా కాన్సెప్ట్ అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమా మొదటగా ఈ ఏడాది ఏప్రిల్ 4న ఇటలీలో విడుదలైంది. ఆ తర్వాతి రోజే ఏప్రిల్ 5న యూనైటెడ్ స్టేట్స్‌లో 20వ సెంచరీ స్టూడియోస్ బ్యానర్‌లో థియేట్రికల్ రిలీజ్ చేసుకుంది.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో
అర్కాషా స్టీవెన్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎట్టకేలకు నెల తర్వాత ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మే 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అంటే సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తోంది భయపెట్టే హారర్ థ్రిల్లర్ ది ఫస్ట్ ఒమెన్ మూవీ. అయితే ఈ సినిమా ఇంగ్లీషుతోపాటు తెలుగు ఇతర దక్షిణాది భాషల్లో కూడా ప్రసారం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బాక్సాఫీస్ కలెక్షన్స్
కాగా ది ఫస్ట్ ఒమెన్ మూవీ డిజిటల్ ప్రీమియర్ చేస్తున్నట్లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఎక్స్ (గతంలో ట్విట్టర్) ద్వారా అధికారికంగా వెల్లడించింది. ఇదిలా ఉంటే, బెన్ జాకోబీ కథ అందించిన ది ఫస్ట్ ఒమెన్ సినిమాలో టైగర్ ఫ్రీ, తౌఫీక్ బర్హోమ్, సోనియా బ్రాగా, రాల్ఫ్ ఇనెసన్, బిల్ నైఘీ కీలక పాత్రలు పోషించారు. టిమ్ స్మిత్, కీత్ థామస్ స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 53.2 మిలియన్ డాలర్స్ రాబట్టి సూపర్ హిట్ అందుకుంది.