TS TET 2024 Exams : రేపట్నుంచే తెలంగాణ టెట్ పరీక్షలు- ఎగ్జామ్ షెడ్యూల్, అభ్యర్థులకు మార్గదర్శకాలివే!

Best Web Hosting Provider In India 2024

TS TET 2024 Exams : రేపట్నుంచి(మే 20) తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET 2024) రాత పరీక్షలు నిర్వహించనున్నారు. టెట్ రాత పరీక్షలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా మే 20 నుంచి జూన్ 2 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి రోజు రెండు సెషన్లలో ఆన్‌లైన్ విధానంలో టెట్ పరీక్షలు జరగనున్నాయి. ఈసారి టెట్ పరీక్షలకు 2,86,386 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. వీరిలో పేపర్-1 కు 99,958 మంది, పేపర్-2కు 1,86,428 మంది అప్లై చేసుకున్నారు.

టీఎస్ టెట్ పరీక్షల షెడ్యూల్

మే 20 నుంచి మే 29 వరకు పేపర్-2, మే 30 నుంచి జూన్ 2 వరకు పేపర్ -1 నిర్వహించనున్నారు.

  • మే 20, 2024 – పేప‌ర్ 2 – మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – S1)
  • మే 20, 2024 – పేప‌ర్ 2 – మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – S2)
  • మే 21, 2024 – పేప‌ర్ 2 -మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – S1)
  • మే 21, 2024 – పేప‌ర్ 2- మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – S2)
  • మే 22, 2024 – పేప‌ర్ 2- మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – S1)
  • మే 22, 2024 – పేప‌ర్ 2 -మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – S2)
  • మే 24, 2024 – పేప‌ర్ 2 -సోష‌ల్ స్టడీస్(మైన‌ర్ మీడియం)(సెష‌న్ – S1)
  • మే 24, 2024 – పేప‌ర్ 2 -సోష‌ల్ స్టడీస్ (సెష‌న్ – S2)
  • మే 28 , 2024– పేప‌ర్ 2 -సోష‌ల్ స్టడీస్(సెష‌న్ – S1)
  • మే 28, 2024 – పేప‌ర్ 2 -సోష‌ల్ స్టడీస్(సెష‌న్ – S2)
  • మే 29, 2024 – పేప‌ర్ 2 సోష‌ల్ స్టడీస్(సెష‌న్ – S1)
  • మే 29, 2024 – పేప‌ర్ 2- సోష‌ల్ స్టడీస్(సెష‌న్ – S2)
  • మే 30 , 2024– పేప‌ర్ 1 -(సెష‌న్ – S1)
  • మే 30, 2024 – పేప‌ర్ 1- (సెష‌న్ – S2)
  • మే 31, 2024 – పేప‌ర్ 1 -(సెష‌న్ – S1)
  • మే 31, 2024 – పేప‌ర్ 1 -(సెష‌న్ – S2)
  • జూన్ 1 , 2024– పేప‌ర్ 2- మ్యాథ్స్ అండ్ సైన్స్ (మైన‌ర్ మీడియం)(సెష‌న్ – S1)
  • జూన్ 1, 2024 – పేప‌ర్ 1-(మైన‌ర్ మీడియం) (సెష‌న్ – S2)
  • జూన్ 2 , 2024– పేప‌ర్ 1 -(సెష‌న్ – S1)
  • జూన్ 2 , 2024– పేప‌ర్ 1- (సెష‌న్ – S2).

టెట్ పరీక్ష విధానం

తెలంగాణ టెట్ పరీక్షలను రెండు పేపర్లలో నిర్వహిస్తారు. పేపర్-1 ను 150 మార్కులకు, పేపర్-2 ను 150 మార్కులకు నిర్వహించనున్నారు. ఒక్కో పేపరులో 150 ప్రశ్నలు అడుగుతారు. పేపర్-1లో 5 పార్ట్ లు ఉంటాయి. ఒక్కో పార్ట్ లో 30 ప్రశ్నలకు 30 మార్కులు కేటాయిస్తారు. పేపర్-2లో 4 పార్టులు ఉంటాయి. వీటిలో మొదటి మూడు పార్ట్ లలో 30 ప్రశ్నలు, ప్రతీ విభాగం నుంచి 30 మార్కులు, నాలుగో విభాగానికి 60 ప్రశ్నలు 60 మార్కులు కేటాయిస్తారు. టెట్ అర్హత మార్కులు జనరల్ అభ్యర్థులకు 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 40 శాతంగా నిర్ణయించారు.

టెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు సూచనలు

  • టీఎస్ టెట్ పరీక్షలకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షల షెడ్యూల్ ప్రకారం ప్రతి రోజు ఉదయం 9.00 నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్ , మధ్యాహ్నం 2.00 గంటల నుంచి 4.30 గంటల వరకు రెండో సెషన్ లో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
  • టెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు బయోమెట్రిక్‌ విధానం అమలు చేస్తున్నారు. దీంతో అభ్యర్థులను పరీక్షకు 90 నిమిషాలు ముందు నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు.
  • పరీక్ష ప్రారంభమయ్యే 15 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ గేట్ మూసివేస్తామని అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని గ్రహించి అభ్యర్థులు వ్యవహరించాలన్నారు. పరీక్షా కేంద్రం గేట్ ఉదయం 8.45 గంటలకు, మధ్యాహ్నం 1.45 గంటలకు అధికారులు మూసివేస్తారు.
  • అభ్యర్థులు హాల్‌టికెట్‌, ఫొటో గుర్తింపు కార్డు, బ్లాక్‌ లేదా బ్లూ బాల్‌ పాయింట్‌ పెన్నును వెంట తీసుకురావాలి. ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ ఫోన్స్ పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.

IPL_Entry_Point

టాపిక్

Telangana NewsTs TetExamsTs Dsc JobsTrending TelanganaTelugu News
Source / Credits

Best Web Hosting Provider In India 2024