Best Web Hosting Provider In India 2024
TS Cabinet Meeting : తెలంగాణ కేబినెట్ సమావేశానికి ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కేబినెట్ భేటీపై కొన్ని షరతులు విధించింది. కేబినెట్ సమావేశంలో అత్యవసరమైన విషయాలపైనే చర్చించాలని తెలిపింది. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు కేబినెట్ సమావేశానికి హాజరు కాకూడదని ఆదేశించింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం మంత్రి వర్గ సమావేశం జరగాల్సి ఉంది కానీ ఈ సమావేశానికి ఈసీ అనుమతి ఇవ్వకపోవడంతో వాయిదా పడింది. తాజాగా కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇచ్చింది.
రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై చర్చ
రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతాంగానికి సంబంధించిన పలు కీలకమైన అంశాలపై చర్చించాలని మంత్రి వర్గం నిర్ణయించింది. అయితే శనివారం కేబినెట్ భేటీకి ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాకపోవడంతో వాయిదా పడింది. కేబినెట్ భేటీకి ప్రభుత్వం ముందుగానే అనుమతి కోరినా ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ విభాగాల అధికారులు శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వేచి చూశారు. రాత్రి 7 గంటల వరకు ఈసీ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో భేటీ వాయిదా పడింది.
రైతాంగానికి సంబంధించిన అత్యవసరమైన అంశాలతో పాటు జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ వేడుకల నిర్వహణ, రాష్ట్ర పునర్విభజనకు పదేండ్లు పూర్తి కానున్న నేపథ్యంలో ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న అనేక అంశాలపై కేబినెట్ లో చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. తాజాగా ఈసీ కేబినెట్ భేటీకి అనుమతి ఇవ్వడంతో…సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంతో సమావేశం నిర్వహించనున్నారు.
టాపిక్