Best Web Hosting Provider In India 2024
Adivi Sesh Honeymoon Express Annapurna Studios: ఎన్ఆర్ఐ ఎంటర్టైన్‌మెంట్స్ (యూఎస్ఏ) (NRI Entertainments)(USA) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (New Reel India Entertainments Pvt Ltd) పతాకంపై నిర్మిస్తున్న సినిమా హనీమూన్ ఎక్స్‌ప్రెస్.
ఇందులో 30 వెడ్స్ 21 యూట్యూబ్ సిరీస్ ఫేమ్ చైతన్య రావు (Chaitanya Rao), కుమారి 21 F హీరోయిన్ హెబ్బా పటేల్ (Hebah Patel) హీరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. పాపులర్ యాక్టర్ తనికెళ్ల భరణి, సీనియర్ హీరోయిన్ సుహాసిని (Suhasini) ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి బాల రాజశేఖరుని రచయిత దర్శకుడు. ఈ చిత్రానికి కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తుండగా.. కేకేఆర్ అండ్ బాల రాజ్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ కామెడీని నిర్మించారు.
ఇప్పటికే హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రం నుంచి సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ (Kalyani Malik) స్వరపరిచిన రెండు రొమాంటిక్ మెలోడీ పాటలు విడుదలై ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌లో నిలిచాయి. ఇప్పుడు ఈ చిత్రం నుంచి మూడో పాటను యాక్షన్ హీరో అడివి శేష్ చేతుల మీదుగా విడుదల చేశారు చిత్ర యూనిట్.
గూఢచారి 2 అండ్ డెకాయిట్ చిత్రాలతో బిజీగా ఉన్నా అడివి శేష్, దర్శకుడు బాల గారి చిరకాల పరిచయం వల్ల అన్నపూర్ణ 7 ఎకరాల ప్రాంగణంలో (Annapurna Studios) హనీమూన్ ఎక్స్‌ప్రెస్‌లోని క్యూట్‌గా స్వీట్‌గా అనే అందమైన లిరికల్ పాటను వీక్షించి విడుదల చేశారు. అనంతరం అడివి శేష్ మాట్లాడుతూ.. “క్యూట్‌గా స్వీట్‌గా పాట చాలా స్వీట్‌గా ఉంది. సాహిత్యం చాలా బాగుంది” అని కొనియాడారు. “చిత్రం మంచి విజయం సాధించాలి” అని అడవి శేష్ ఆకాంక్షించారు.
“ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, క్యూట్‌గా స్వీట్‌గా అనే అందమైన పాటను విడుదల చేసిన అడివి శేష్ గారికి నా కృతజ్ఞతలు. అడివి శేష్ (Adivi Sesh) తన మొదటి చిత్రం అమెరికాలో విడుదల చేయడానికి నన్ను సంప్రదించారు. తనకు మంచి టాలెంట్ ఉంది అని అప్పుడే గమనించాను” అని డైరెక్టర్ బాల రాజశేఖరుని తెలిపారు.
“మా హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రం మంచి మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. మా చిత్రంలోని ప్రతి పాట చాలా బాగుంటుంది. మంచి పాటలు స్వరపరిచిన కళ్యాణి మాలిక్ గారికి కృతజ్ఞతలు. ఈ క్యూట్ గా స్వీట్ గా పాటకు కిట్టూ విస్సాప్రగడ లిరిక్స్ అందించగా బాహుబలి ఫేమ్ దీపు తన గాత్రంతో ప్రాణం పోశారు” అని డైరెక్టర్ అన్నారు.
“త్వరలోనే హనీమూన్ ఎక్స్‌ప్రెస్ ట్రైలర్‌ను విడుదల చేసి ఈ చిత్రాన్ని ఈ సమ్మర్‌లో విడుదల చేయటానికి సిద్ధంగా ఉన్నాం” అని హనీమూన్ ఎక్స్‌ప్రెస్ డైరెక్టర్ బాల రాజశేఖరుని పేర్కొన్నారు. కాగా ఈ సినిమాలో చైతన్య రావు, హెబ్బా పటేల్, తనికెళ్ల భరణి (Tanikella Bharani), సుహాసినితోపాటు అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ, తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.