Best Web Hosting Provider In India 2024
Deepika Padukone Baby Bump: బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ గర్భవతి అన్న వార్తలు వచ్చిన తర్వాత తొలిసారి ఇప్పుడు ఆమె తన బేబీ బంప్ తో కనిపించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె తన ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేయగా.. మూడు నెలల పాటు తన గర్భాన్ని ఫొటోల్లో కనిపించకుండా జాగ్రత్త పడింది. ఇప్పుడు ఓటేయడానికి రాగా.. ఆమె వేసుకున్న వైట్ షర్ట్ నుంచి తొలిసారి ఆమె గర్భం కనిపించింది.
దీపికా పదుకోన్ బేబీ బంప్
బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్, దీపికా పెళ్లి చేసుకొని సుమారు ఆరేళ్లు అవుతోంది. గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారా అని ఎదురు చూసిన అభిమానులకు.. మొత్తానికి ఈ కపుల్ ఆ వార్త చెప్పింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో తమ తొలి సంతానాన్ని పొందబోతున్నట్లు వాళ్లు మూడు నెలల కిందట సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మూడు నెలలుగా దీపికా తన ఫొటోలను అప్‌లోడ్ చేస్తూనే ఉంది.
అయితే వాటిలో ఎక్కడా తన బేబీ బంప్ కనిపించకుండా జాగ్రత్త పడింది. అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడకకు వచ్చినా.. అక్కడా కెమెరాలకు కనిపించకుండా జాగ్రత్త పడింది. మొత్తానికి సోమవారం (మే 20) ముంబైలో లోక్‌సభ ఐదో విడత ఎన్నికల్లో ఓటేయడానికి వచ్చిన సమయంలో దీపికా పదుకోన్ గర్భం స్పష్టంగా కనిపించింది. రణ్‌వీర్, దీపికా ఇద్దరూ డెనిమ్ ప్యాంట్స్, వైట్ షర్ట్స్ లో ఓటేయడానికి వచ్చారు.
దీపికా కారు దిగినప్పటి నుంచీ రణ్‌వీర్ ఆమె వెంటే ఉంటూ జాగ్రత్తగా పోలింగ్ బూత్ లోకి ఆమెను తీసుకెళ్లాడు. ఈ సమయంలో దీపికా తన బేబీ బంప్ పై చేయి వేసి జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్లింది. ఆమెను కెమెరాల్లో బంధించడానికి ఫొటోగ్రాఫర్లతోపాటు అక్కడికి ఓటేయడానికి వచ్చిన అభిమానులు కూడా ఎగబడ్డారు.
ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ కొంత మంది తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సరోగసీ ద్వారా ఆమె బిడ్డను కంటుందని అన్నారు కదా.. ఇప్పుడు చూశారా అంటూ దీపికను విమర్శించిన వారిపై వాళ్లు మండిపడుతున్నారు.
కల్కి 2898 ఏడీలో దీపికా
దీపికా పదుకోన్ ప్రస్తుతం ప్రెగ్నెన్సీ కారణంగా సినిమా షూటింగ్ ల నుంచి బ్రేక్ తీసుకుంది. అయితే ఇప్పటికే త్వరలో రాబోతున్న సినిమాల షూటింగ్స్ మాత్రం పూర్తి చేసుకుంది. ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడీ మూవీలోనూ దీపికా ఉన్న విషయం తెలిసిందే. చాలా రోజుల కిందటే ఈ మూవీలో తన పాత్ర షూటింగ్ ను దీపికా పూర్తి చేసుకుంది.
ఈ కల్కి 2898 ఏడీ మూవీ జూన్ 27న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇక తన భర్త రణ్‌వీర్ సింగ్ తోనే కలిసి సింగం అగైన్ మూవీలోనూ నటిస్తోంది. ఈ ఏడాది మొదట్లో ఆమె హృతిక్ రోషన్ తో కలిసి ఫైటర్ మూవీలో నటించింది. 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ సినిమాగా ఈ మూవీ నిలిచింది. ఇందులో ఆమె ఓ ఫైటర్ జెట్ పైలట్ గా నటించింది.