Best Web Hosting Provider In India 2024
AP Aarogya Sri : ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలపై స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మే 22 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వానికి స్పెషాల్టీ ఆసుపత్రుల సంఘం సోమవారం లేఖ రాసింది. గతేడాది ఆగస్టు నుంచి రూ.1500 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, వీటిని చెల్లించాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో లక్ష్మీ షాను విజ్ఞప్తి చేసింది. లేని పక్షంలో మే 22 నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని స్పష్టం చేసింది. గత 6 నెలలుగా ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడంలేదని లేఖలో తెలిపింది. మే 4 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని చెప్పినా ప్రభుత్వం స్పందించలేదని పేర్కొంది. సుదీర్ఘ కాలంగా బిల్లులు చెల్లించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం తెలిపింది. పెండింగ్ బిల్లులపై ఇప్పటికే పలుమార్లు లేఖలు రాసినా కేవలం రూ.50 కోట్లు మాత్రమే చెల్లించారని లేఖలో పేర్కొంది.
సంబంధిత కథనం
టాపిక్