Best Web Hosting Provider In India 2024
Brahmamudi May 21st Episode: భద్రాచలం నుంచి రాములవారి అక్షింతలు తీసుకొని వస్తాడు పంతులు. ఈ అక్షింతలు భార్యపై భర్త వేస్తే వారు ఆదర్శ దంపతులుగా కలకాలం కలిసి ఉంటారని అంటాడు. ఇంట్లోని మగవాళ్లు అందరూ పంతులు చెప్పినట్లు భార్యపై అక్షింతలు చల్లి వారిని ఆశీర్వదిస్తుంటారు.
రుద్రాణి ధర్మ సందేహం…
కావ్య వంతు రాగానే…ధర్మ సందేహం పేరుతో అడ్డుపడుతుంది రుద్రాణి. శ్రీరాముడి అక్షింతలు వేసే అర్హత ఏకపత్నీవ్రతుడికే ఉంటుందా అని పంతులుగారిని అడుగుతుంది. రుద్రాణి మాటల వెనుక ఉన్న సెటైర్‌ను అర్థం చేసుకున్న కావ్యతో పాటు స్వప్న ఆమెపై మాటలతో విరుచుకుపడతారు. శ్రీరామనవమిరోజు అనామిక ఇలాగే అడ్డుపడింది. ఆ పాపం శాపంగా మారి ఇప్పుడు సింగిల్‌గా మిగిలింది. ఇప్పుడు మీరు మొదలుపెట్టారా? మీ బుద్ది చూపించుకున్నారు అంటూ అత్తను చెడమడా వాయిస్తుంది స్వప్న.
కావ్య క్లాస్…
భర్త బ్రతికుండి…ఆయన పక్కనలేకపోయేసరికి…బాగున్నా జంటలను చూసి ఓర్వలేక, కడుపుమంటతో ఇలాంటి పుల్లలు పెట్టి కొందరు పైశాచిన ఆనందం పొందుతుంటారు అంటూ రుద్రాణిని అవమానిస్తుంది కావ్య. నా భర్త పక్కనలేడని ఏ రోజు బాధపడలేదని కావ్యకు సమాధానమిస్తుంది రుద్రాణి.బాధపడే రకానివి అయితే భర్త దగ్గరకే వెళ్లేదానివని స్వప్న అంటుంది. వీలైతే అంక్షితలు పట్టుకొని మీ ఆయన దగ్గరకు వెళ్లండి…అంతేకానీ ధర్మ సందేహాల పేరుతో మా పనికి అడ్డురావద్దని రుద్రాణికి కావ్య వార్నింగ్ ఇస్తుంది.
నా భర్త శ్రీరామచంద్రుడే…
ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా నా భర్త శ్రీరామచంద్రుడే అని రాజ్‌ను ఉద్దేశించి అంటుంది కావ్య. రాజ్ ఆశీర్వాదం తీసుకుంటుంది. ఆ తర్వాత స్వప్న కూడా రాహుల్ ఆశీర్వాదం తీసుకుంటుంది. అది చూసి రాహుల్ నవ్వుకుంటాడు. వసుదేవుడు అంతటోడికే తప్పలేదు నేనేంత అని స్వప్న అంటుంది.
సింగిల్‌గా అనామిక…
దుగ్గిరాల కుటుంబంలోని ఆడవాళ్లు అందరూ తమ భర్తల ఆశీర్వాదం తీసుకుంటారు. చివరకు అనామిక ఒక్కతే మిగిలిపోతుంది. ఆమె కూడా అంక్షింతలు తీసుకొని కళ్యాణ్ దగ్గరకు వస్తుంది. కళ్యాణ్ కవిత రాయడంలో నిమగ్నమవుతాడు. అనామిక పిలవగానే..అతడి కవిత్వం మధ్యలోనే ఆగిపోతుంది.
దాంతో అనామికపై ఫైర్ అవుతాడు. పూజారి భద్రచాలం నుంచి అంక్షింతలు తీసుకొచ్చారని, ఆ అంక్షితలు వేసి తనను ఆశీర్వదించమని కళ్యాణ్‌ను కోరుతుంది అనామిక. అరిచి, గోలచేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు అంక్షితలు వేయమంటే ఏ భర్త వేయరు. కలకాలం కష్టసుఖాల్లో నీకు తోడుగానీడుగా ఉంటామని చెప్పడానికే భగవంతుడి అంక్షింతలు వేస్తారు.
నేను నీతో కలిసి ఉండాలని అనుకోవడం లేదు. విడిపోవాలనే నిర్ణయించుకున్నాను. అలాంటప్పుడు అంక్షింతలు వేయడంలో అర్థం లేదని అనామిక తో అంటాడు కళ్యాణ్. మంచి మూడ్ మొత్తం చెడగొట్టావని కోపంగా కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
కళ్యాణ్‌కు సర్ధిచెప్పిన కావ్య…
అనామికతో కళ్యాణ్ గొడవపడటం కావ్య చూస్తుంది. కళ్యాణ్‌నే తప్పుపడుతుంది. అనామిక నుంచి విడిపోవాలనే నీ నిర్ణయం సరైందని కాదని అంటుంది. విడిపోవడం అంత సులభం కాదని అంటుంది. కష్టమైన, సుఖమైన పంచుకోవడానికి ఓ భాగస్వామి ఉండాలి. లేదంటే ఆ జీవితం తెగిన గాలిపటం అవుతుంది. అనామిక వల్ల నువ్వేమి భరించలేని బాధను, నరకాన్ని అనుభవించడం లేదు. చిన్న తప్పులకే విడిపోవడం కరెక్ట్ కాదని కళ్యాణ్‌కు క్లాస్ ఇస్తుంది కావ్య.
విడిపోవడం కరెక్ట్ కాదు…
ఇంట్లో కోడలిగా అడుగుపెట్టినప్పుడు తనకు ఎవరూ విలువ ఇవ్వలేదని, కనీసం ఇంటి సభ్యురాలిగా గుర్తించలేదని కావ్య బాధపడుతుంది. నా స్థానాన్ని కాపురాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోరాడుతూనే ఉన్నానని అంటుంది. భార్య, భర్తల బంధాన్ని విడిదీయడం ఎవరి వల్ల కాదని అంటుంది. మీ కాపురాన్ని సరిచేసుకునే మార్గాలు వెతుక్కోమని అంటుంది. అంతేకానీ విడిపోవడం కరెక్ట్ కాదని కళ్యాణ్‌కు సర్ధిచెబుతుంది కావ్య.
మాట ఇంటి అడ్రెస్…
మాయ ఇంటి అడ్రెస్‌ను కష్టపడి కనిపెడతారు కావ్య, అప్పు. వారిని మాయ గుర్తుపడుతుంది. కానీ ఎవరో తెలియనట్లు నటించి డోర్ మూసి పారిపోబోతుంది. ఆమె ప్లాన్‌ను అప్పు అడ్డుకుంటుంది. ఎక్స్‌ట్రాలు చేస్తే తుక్కురేగ్గొడతామని వార్నింగ్ ఇస్తుంది.
పోలిస్ స్టేషన్‌లో అప్పగిస్తే…
బాబు పేరుతో నువ్వు అడుతున్న అబద్దాలకు కారణాలు, వాటి వెనుక ఉన్న నిజాలు చెప్పమని మాయకు వార్నింగ్ ఇస్తుంది కావ్య. తనకేమి తెలియదని మాయ అంటుంది. నువ్వు డబ్బు కోసం బిడ్డను వదలుకోవడానికి సిద్ధపడ్డావంటే నీకు మా మావయ్య సుభాష్‌కు ఎలాంటి సంబంధం లేదని అర్థమవుతుందని కావ్య అంటుంది.
తనకు ఏ నిజాలు తెలియదని, తాను ఎక్కడికి రానని మాయ పట్టుపడుతుంది. మాయను పోలీస్‌స్టేషన్‌లో అప్పగిస్తే నిజాలు వాటంతట అవే బయటకు వస్తాయని అప్పు అంటుంది. నీవు ఎవరిని మోసం చేసింది పోలీసులు బయటపెట్టిస్తారని కావ్య అంటుంది. స్టేషన్ తీసుకెళ్లడానికి రెడీ అయినట్లుగా నిల్చొంటారు.
భయపడ్డ మాయ…
తనను కావ్య, అప్పు పోలీస్ స్టేషన్ తీసుకెళతారని అనుకొని మాయభయపడిపోతుంది. ఆ బిడ్డకు, సుభాష్‌కు ఏ సంబంధం లేదని నిజం బయటపెడుతుంది మాయ. డబ్బు కోసమే ఆ బిడ్డకు సుభాష్ తండ్రి అని అబద్ధం ఆడానని, కుటుంబం కోసం, సమాజంలో పరువు ప్రతిష్టాలకు భయపడి సుభాష్ అడిగినంత డబ్బు ఇస్తాడనే ఈ నాటకం ఆడానని అంటుంది. ఆమె మాటలతో కావ్య కోపం పట్టలేకపోతుంది. మాయ చెంపపై గట్టిగా ఒక్కటి కొడుతుంది.
క్షమాభిక్ష అడగాలి…
నీ వల్ల మా కుటుంబం మొత్తం ముక్కలైపోయిందని మాయపై ఫైర్ అవుతుంది. నువ్వు ఒప్పుకున్న ఈ నిజం మా కుటుంబం అందరి ఒప్పుకోవాలని అంటుంది. ఆ బిడ్డకు మా మావయ్యకు ఎలాంటి సంబంధం లేదని ఒప్పుకోవాలి. మా అత్తగారి కాళ్లుపట్టుకొని క్షమాభిక్ష అడగాలి. లేదంటే పోలీసులకు నిన్ను అప్పజెప్పడం ఖాయమని అంటుంది కావ్య, అప్పు అంటారు.
భర్తను నిరపరాధిగా రుజువు చేస్తా…
తన భర్తను నిరపరాధిగా రుజువు చేయడమే తన కర్తవ్యమని కావ్య అంటుంది. ఆయన్ని నిందించినందుకు, వెలివేసినందుకు కుటుంబసభ్యులు బాధపడాలి. రాజ్ వ్యక్తిత్వం ఎంత గొప్పదో అపర్ణకు అర్థం కావాలంటే నువ్వు నిజాలు మొత్తం చెప్పాలని మాయతో అంటుంది కావ్య.మాయను తీసుకొని దుగ్గిరాల ఇంటికి వస్తారు కావ్య, అప్పు.
రుద్రాణి సెటైర్…
ఈ రోజు ఆ బిడ్డ తల్లిని పట్టుకొని నా ముందు నిలబెడతానని అన్న కావ్య ఇప్పుడు ఎక్కడుంది అంటూ ఇందిరాదేవిని అడుగుతుంది అపర్ణ.తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కోవడానికి ఆ పిచ్చిది వెళ్లిందన్న మాట, ఈ రోజు ఈ ఇళ్లు మరోసారి రచ్చబండగా మారడం ఖాయమని ఇందిరాదేవి అంటుంది. తన మొహం ఎవరికి చూపించలేక వెళ్లిపోయి ఉంటుందని, కావ్య ఎప్పటికీ తిరిగి రాదని రుద్రాణి అంటుంది.
కావ్య ఎంట్రీ…
అప్పుడే అక్కడికి ఎంట్రీ ఇచ్చిన కావ్య…ఆ అవసరం నాకు లేదని అంటుంది. అనుకున్నది ఆలస్యం కావచ్చుకానీ సాధించి తీరుతానని అంటుంది. మాయను తీసుకొచ్చి అందరి ముందు నిలబెడుతుంది. మాయను చూసి సుభాష్, రాజ్‌తో పాటు అందరూ షాకవుతారు. నీ ఘనకార్యాలు, నువ్వు చేసిన మాయోపాయాలు అందరి ముందు చెప్పమని మాయతో అంటుంది కావ్య.
రాజ్ పెంచుకుంటున్న బిడ్డకు తల్లిని నేనే అని మాయ అంటుంది. ఆ బిడ్డకు తండ్రి ఎవరు అని ఇందిరాదేవి అడుగుతుంది. రాజ్ అని ఆమె సమాధానం చెప్పడంతో కావ్య షాకవుతుంది.