
అనంతపురం: ప్రెస్‌మీట్లు పెట్టి మాటలాడలేని నాయకులు కూడా ఈ రోజు ప్రజల మధ్యకు వచ్చి సినిమా డైలాగులు చెబుతున్నారని వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి విమర్శించారు.ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చెప్పిన సినిమా డైలాగులకు సిద్ధార్థరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎన్నికలకు సమయం దగ్గర పడే కొద్ది ఎవరెవరో వచ్చి విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు సుపరిపాలన అందిస్తూ అనతికాలంలోనే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. జననేతకు వస్తున్న ఆదరణ చూసి విపక్షాలు ఓర్వలేకపోతున్నాయన్నారు. ప్రజల అభిమానం ఉన్నంత వరకు వైయస్ జగన్ దరిదాపుల్లోకి ఎవరూ రాలేరని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు.