Best Web Hosting Provider In India 2024
శనగలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. వీటితో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. చాలా మంది శనగలతో కర్రీ చేసుకుని తింటారు. అయితే ఎప్పుడూ ఒకేలాగా కాకుండా శన మసాలా తయారు చేయండి. చాలా రుచిగా ఉంటుంది. మీ ఇంట్లో చపాతీ, రైస్ ఉన్న కూడా ఈ కర్రీని తినవచ్చు. సైడ్ డిష్‌గా కూడా ఉపయోగపడుతుంది.
కాస్త డిఫరెంట్‌గా శనగల మసాలా చేసుకోండి. ఈ తరహా శనగల మసాలా తయారు చేయడం చాలా సులభం, పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. శనగల మసాలా రెసిపీ ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? కింది ఈజీగా ప్రాసెస్ ఉంది. ఈ రెసిపీ చేసేందుకు సమయం ఎక్కువగా పట్టదు. అంతేకాదు.. శన మసాలా కోసం పదార్థాలు కూడా ఎక్కువగా అవసరం లేదు.
శన మసాలాకు కావాల్సిన పదార్థాలు :
శనగలు – 200 గ్రాములు (నీళ్లలో నానబెట్టి), నూనె – 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర – 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – 2 ముక్కలు, లవంగాలు – 4, యాలకులు – 4, బిర్యానీ ఆకులు – 1, ఉల్లిపాయ – 2, టొమాటోలు – 2 (గ్రైండ్ చేసినవి), అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 tsp, కారం పొడి – 1 tsp, ధనియాల పొడి – 1 1/2 tsp, గరం మసాలా – 1/2 tsp, ఉప్పు – రుచి ప్రకారం, కొత్తిమీర – కొద్దిగా.
శన మసాలా తయారీ విధానం
ముందుగా శనగలను నీళ్లలో 5 గంటలు నానబెట్టాలి. తర్వాత కావాలంటే కొంచెం వేడి నీటిలో ఉడికించాలి.
తర్వాత ఓవెన్ లో కుక్కర్ పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక అందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జీలకర్ర, బిర్యానీ ఆకులు వేసి వేయించాలి.
ఇప్పుడ ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారే వరకు వేయించాలి.
ఆనంతరం అందులో టొమాటో రుబ్బి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, నీళ్లు పోయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా వేగించాలి.
ఇప్పుడు కారం, ధనియాల పొడి, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి 2-3 నిమిషాలు బాగా తిప్పాలి.
తర్వాత నానబెట్టిన శనగలను కడిగి వేసుకోవాలి. తర్వాత కావల్సినంత నీళ్లు పోసి తిప్పి కుక్కర్‌ను మూతపెట్టి 6-7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. అనంతరం ఉప్పు వేసుకోవాలి.
చివరగా పైన కొత్తిమీర చల్లి తిప్పితే రుచికరమైన శనగల మసాలా రెడీ.