Best Web Hosting Provider In India 2024
TS PGECET 2024: తెలంగాణలో TS PGECET – 2024 ప్రవేశపరీక్ష దరఖాస్తుల సమర్పణకు గడువు నేటితో ముగియనుంది. తెలంగాణలో పీజీ ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశాల కోసం తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది.
ప్రవేశ పరీక్ష – టీఎస్‌పీజీఈసెట్ 2024(TS PGECET 22024)
పరీక్ష నిర్వహించే వర్శిటీ -జేఎన్‌టీయూ, హైదరాబాద్
కోర్సులు – ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా-డి
అర్హతలు – అభ్యర్థులు బీఈ/బీటెక్/బీఆర్క్/ బీప్లానింగ్/బీఫార్మసీ, ఎంఏ/ఎంఎస్సీ (సోషియాలజీ, ఎకనామిక్స్, జియోగ్రఫీ) ఉత్తీర్ణులై ఉండాలి. పూర్తిస్థాయి వివరాలను నోటిఫికేషన్ లో చూడొచ్చు.
దరఖాస్తులు – ఆన్ లైన్
రూ.2500 ఆలస్య రుసుముతో అప్లికేషన్లకు తుది గడువు – 21-మే-2024.
రూ.5000 ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరితేదీ – 25-మే-2024.
హాల్ టికెట్ల డౌన్‌లోడ్: 28 మే 2024.
పరీక్షలు ప్రారంభం – జూన్ 10, 2024.
పరీక్షలు పూర్తి అయ్యే తేదీ – జూన్ 13, 2024.
అధికారిక వెబ్ సైట్ – https://pgecet.tsche.ac.in/
దరఖాస్తు లింక్ – https://pgecet.tsche.ac.in/PGECET_HomePage.aspx
ఇంజినీరింగ్ పీజీ కోర్సుల్లో నిర్వహించే తెలంగాణ పీజీఈసెట్(TS PGECET 2024 ) నోటిఫికేషన్ వచ్చింది. 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంఈ, ఎంటెక్, , ఎంఫార్మసీ, ఫార్మా-డి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను మంగళవారం విడుదల చేసింది రాష్ట్ర ఉన్నత విద్యా మండలి. మార్చి 16వ తేదీ నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు. జూన్ 6వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. https://pgecet.tsche.ac.in వెబ్ సైట్ లోకి వెళ్లి అభ్యర్థులు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
మారిన షెడ్యూల్….
తెలంగాణలో పీజీఈసెట్ -2024 పరీక్షల షెడ్యూల్ మారింది. ఈ మేరకు అధికారులు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షల నేపథ్యంలో PGECET రాత పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు కన్వీనర్ డాక్టర్ ఏ అరుణ కుమారి వెల్లడించారు.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం…. పీజీఈసెట్ పరీక్షలు జూన్ 6వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. జూన్ 9వ తేదీతో ఎగ్జామ్స్ పూర్తి కావాలి. కానీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు, టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షల నేపథ్యంలో పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చేశారు. తెలంగాణ పీజీఈసెట్ రాత పరీక్షలను జూన్ 10 నుంచి ప్రారంభించనున్నారు. జూన్ 13వ తేదీతో పూర్తి కానున్నాయి.
ఇంజినీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ పీజీఈసెట్(TS PGECET 2024) నిర్వహిస్తున్నారు. 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా-డి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. https://pgecet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అభ్యర్థులు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
రూ.2500 ఆలస్య రుసుముతో అప్లికేషన్లకు తుది గడువు మే 21తో ముగినుంది. రూ.5000 ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరితేదీ – 25-మే-2024 వరకు ఉంది.
తెలంగాణ పీజీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ హాల్ టికెట్లను మే28 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూన్- 6 నుంచి జూన్-9 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
అధికారిక వెబ్ సైట్ – https://pgecet.tsche.ac.in/
దరఖాస్తు లింక్ – https://pgecet.tsche.ac.in/PGECET_HomePage.aspx
సంబంధిత కథనం
టాపిక్