Best Web Hosting Provider In India 2024
Prasanth Ranveer Movie: హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ శర్మ, బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ మూవీ ముందడుగు వేయడం లేదని, వీళ్లిద్దరి మధ్య క్రియేటివ్ డిఫెరెన్సెస్ తో సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చిన విషయం తెలుసు కదా. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని ఆ మూవీ వర్గాలు హిందుస్థాన్ టైమ్స్ తో వెల్లడించాయి.
అది నిజం కాదు..
మంగళవారం (మే 21) ఉదయం నుంచీ ఈ వార్తలు రావడంతో ప్రశాంత్ వర్మ టీమ్ లోని ఓ మెంబర్ హిందుస్థాన్ టైమ్స్ తో మాట్లాడుతూ అందులో నిజం లేదని స్పష్టం చేశారు. “క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ప్రశాంత్ శర్మ, రణ్‌వీర్ సింగ్ ఎవరి దారి వాళ్లు చూసుకున్నారని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. నిజానికి హనుమాన్ జయంతి రోజే పూజా కార్యక్రమాలతో వాళ్లు హైదరాబాద్ లో షూటింగ్ కూడా ప్రారంభించారు” అని అతని టీమ్ మెంబర్ వెల్లడించారు.
ఇక మంగళవారం తెల్లవారుఝామున 4 గంటల వరకు కూడా ప్రశాంత్ ఈ సినిమా షూటింగ్ జరిపాడని, రణ్‌వీర్ ఇప్పటికే కొన్ని సీన్లు పూర్తి చేశాడని కూడా చెప్పడం గమనార్హం. ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక సమాచారం కూడా త్వరలోనే వస్తుంది అని మూవీ వర్గాలు తేల్చి చెప్పాయి. హనుమాన్ తర్వాత పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. రణ్‌వీర్ సింగ్ తో రాక్షస్ అనే మూవీ తీయబోతున్నాడని చాలా రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
అసలు ఏం జరిగింది?
ప్రశాంత్ వర్మ, రణ్‌వీర్ సినిమాకు రాక్షస్ అనే పేరు కూడా పెట్టినట్లు కూడా సమాచారం. ఈ సినిమా నిజానికి ఈ ఏడాది జులై నుంచి షూటింగ్ జరుపుకోవాల్సి ఉంది. అయితే ఈ ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ సినిమాను పక్కన పెట్టేసి, ఎవరి దారి వాళ్లు చూసుకున్నారంటూ పింక్‌విల్లా తన రిపోర్టులో వెల్లడించింది. అంతేకాదు భవిష్యత్తులో మరోసారి కలిసి పని చేయడానికి కూడా అంగీకరించినట్లు తెలిపింది.
కానీ ఈ వార్తలను ప్రశాంత్ వర్మ టీమ్ ఖండించింది. ప్రస్తుతం దీపికా పదుకోన్ తో కలిసి తన తొలి సంతానం కోసం ఎదురు చూస్తున్న రణ్‌వీర్ ఎక్కువ సమయం కుటుంబానికే కేటాయిస్తున్నాడు. డాన్ 3, శక్తిమాన్ లాంటి సినిమాలు కూడా అతని భవిష్యత్తు ప్రాజెక్టుల్లో ఉన్నాయి. ఆదిత్య ధర్ తో మరో మూవీ కూడా చేయనున్నట్లు సమాచారం.
రాక్షస్ మూవీ ఏంటి?
హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ సాధించిన ప్రశాంత్ వర్మ.. తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే రణ్‌వీర్ సింగ్ తో మరో మైథలాజికల్ బ్యాక్‌గ్రౌండ్ లో స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన కథగా ఈ మూవీ రూపొందించనున్నట్లు పింక్‌విల్లా తెలిపింది. ఈ సినిమాకు రాక్షస్ అనే టైటిల్ కూడా పెట్టినట్లు సమాచారం. రణ్‌వీర్ తో ప్రశాంత్ వర్మ సినిమాను గతంలో అతని టీమ్ మెంబర్ కూడా కన్ఫమ్ చేశారు.
హిందుస్థాన్ టైమ్స్ తో మాట్లాడుతూ.. “అవును ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రణ్‌వీర్ తో సినిమా చేయడానికి అతన్ని కలిశాడు. హనుమాన్ తర్వాతి ప్రాజెక్ట్ అదే. రణ్‌వీర్ కూడా ఆసక్తిగానే ఉన్నాడు కానీ ఫైనలైజ్ చేయలేదు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కన్ఫమ్ అయిన తర్వాత అధికారిక ప్రకటన ఉంటుంది” అని అప్పట్లో ఆ టీమ్ మెంబర్ వెల్లడించారు.