దోచిన డ‌బ్బు దాచడానికి చంద్ర‌బాబు దుబాయ్ వెళ్లాడా..?

Best Web Hosting Provider In India 2024

బాబే పారిపోయాడు మా గతేంటని టీడీపీ నేతలు జుట్టు పీక్కుంటున్నారు

సీఎం వైయస్ జగన్ ఎక్కడికి వెళ్తున్నారో బహిరంగంగా చెప్పి వెళ్లారు

వైయస్సార్ సీపీ ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ప్రభంజనం సృష్టించబోతోంది

కూటమినిసమాధి చేసే  ప్రజా తీర్పు జూన్ 4న రాబోతోంది

గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి ర‌మేష్‌

తాడేప‌ల్లి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎక్కడకి వెళ్ళాడు.. ఏమైపోయాడు.. ఆయన ఏ దేశానికి పారిపోయాడు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ అని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి ర‌మేష్ అన్నారు. ఎల్లో మీడియాకు కూడా చెప్పకుండా చంద్రబాబు ఎక్కడికి వెళ్ళారని ప్ర‌శ్నించారు . రాష్ట్ర ప్రజలతో పాటు టీడీపీ నేతలకు కూడా చంద్రబాబు ఎక్కడ ఉన్నారో తెలియడం లేదన్నారు. చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్ళాడని అంటున్నారని, అంటే ఎక్కడకు వెళ్లినట్లు.. దోచిన డబ్బులు దుబాయ్‌లో దాయటానికి వెళ్ళాడా..? అని ప్ర‌శ్నించారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి జోగి ర‌మేష్ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి జోగి ర‌మేష్ ఏం మాట్లాడారంటే.. 
త్వరలో టీడీపీ అడ్రస్ గల్లంతు కాబోతుంది. దాంతో  టీడీపీ నేతల నోటికి తాళాలు పడతాయి. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి కుప్పకూలి పోతుంది. చంద్రబాబే పారిపోయాడు మా గతి ఏంటని టీడీపీ నేతలు జుట్టు పీక్కుంటున్నారు. మా నాయకుడు వైయస్ జగన్ ఎక్కడికి వెళ్తున్నారో బహిరంగంగా చెప్పి వెళ్ళారు. చంద్రబాబు దుబాయ్ వెళ్ళాడా..? ఇటలీ వెళ్ళాడా..? అమెరికా వెళ్ళాడా..? ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి వెళ్ళాడో రాష్ట్ర ప్రజలకి తెలియాలి. 

ఎన్నికలలో విలువలకు, విశ్వసనీయతకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టం కట్టబోతున్నారు. వైయస్సార్ సీపీ ఆంధ్రప్రదేశ్లో మరోసారి ప్రభంజనం సృష్టించబోతోంది. వైయస్ జగన్ వైపు రాష్ట్ర ప్రజలు నిలబడ్డారు. మరలా వైయస్ జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. కూట‌మి కుట్రలు, కుతంత్రాలు పన్నింది. ఎన్నికల కమిషన్ చేత ఎస్పీలను, కలెక్టర్లను మార్పించారు. మార్చిన చోటే ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పల్నాడులో ఘర్షణలకు కారణం చంద్రబాబు. పురందేశ్వరి ఈసీకి తప్పుడు ఫిర్యాదులు ఇవ్వడం వల్లనే అధికారులను ఈసీ మార్చింది. పరిపాలన సక్రమంగా చేసే ఎస్పీలను, కలెక్టర్లను కావాలని కుట్రపూరితంగా మారిస్తే, అదే ప్రాంతంలో గొడవలు జరిగితే నూతనంగా నియమితులైన అధికారులను సస్పెండ్ చేశారు. వ్యవస్థ‌లను వాడుకున్నారు. నిబద్ధ‌తను గాలికొదిలేశారు. వ్యవస్థ‌లను భ్రష్టుపట్టించడంలో చంద్రబాబు అందెవేసిన చెయ్యి. 

ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికలలో వైయస్సార్ సీపీ ప్రజాస్వామ్యబద్ధం నిలబడింది. ప్రజల ఆశీస్సులతో ఘనవిజయం సాధించబోతున్నాం. ప్రజలు నమ్మకాన్ని వైయస్ జగన్ పై ఉంచారు. టీడీపీ, జనసేనలు ఎన్నికుట్రలు పన్నినా, ఎన్ని విధ్వంసాలు చేసినా, శాంతిభధ్రతలకు విఘాతం కలిగించినా 
ప్రజాస్వామ్యంలో అంతిమంగా వైయస్సార్ సీపీ విజయం సాధిస్తుంది. మా ఎమ్మెల్యేలు, మంత్రులపై 304, 307 కేసులు, ఎస్సీ, ఎస్టీ యాక్టులు పెట్టినా, సరే ధైర్యంగా ప్రజాక్షేత్రంలో నిలబడ్డాం. వైయస్సార్ సీపీ జెండా రెపరెపలాడబోతోంది. 

జూన్ 4వ తేదీన సంబరాలకు సిద్ధం కావాలని వైయస్సార్ సీపీ శ్రేణులకు పిలుపునిస్తున్నాం. జూన్ 4న కూటమిని ప్రజలు సమాధి చేస్తారు. కూటమి దత్త పుత్రుడు ఏమయ్యాడో తెలీదు. భారీ మెజారిటీతో సీఎంగా వైయస్ జగన్ మరోసారి అధికారం చేపట్టబోతున్నారు. ఎన్నికల కమిషన్‌ను అడ్డం పెట్టుకొని కూటమి నేతలు కుట్రలు, కుతంత్రాలు చేశారు. పెనమలూరులో వైయస్సార్ సీపీకి మళ్ళీ పట్టం క‌డతారు` అని మంత్రి జోగి ర‌మేష్ ధీమా వ్య‌క్తం చేశారు.

Best Web Hosting Provider In India 2024