Best Web Hosting Provider In India 2024
Pushpa 2 Second Song: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ నుంచి రెండో పాట వచ్చేస్తోంది. ‘పుష్ప.. పుష్ప’ అంటూ ఈనెల మొదట్లో వచ్చిన మాస్ బీట్ సాంగ్ అందరినీ ఊపేస్తోంది. ఇంకా ఈ పాట జోష్ జోరుగా ఉంది. ఇక రెండో పాట కూడా రిలీజ్ చేసేందుకు పుష్ప టీమ్ రెడీ అయింది. పుష్ప 2 రెండో పాటపై అప్‍డేట్ ఇచ్చేందుకు టైమ్ ఖరారు చేసింది మూవీ టీమ్.
అప్‍డేట్ ఎప్పుడంటే..
పుష్ప 2 ది రూల్ సినిమా నుంచి రెండో పాట అప్‍డేట్ రేపు (మే 22) ఉదయం 11 గంటల 7 నిమిషాలకు రానుంది. ఈ విషయాన్ని ఈ మూవీని నిర్మిస్తున్న మైత్రీమూవీ మేకర్స్ నేడు (మే 21) వెల్లడించింది. రెండు వేళ్లను చూపిస్తున్న ఎమోజీని ట్వీట్ చేసింది. రేపు 11:07 గంటలకు అంటూ పోస్ట్ చేసింది.
మరి, రెండో పాటకు సంబంధించిన ప్రోమోను రేపు (మే 22) తీసుకొస్తుందా.. లేకపోతే ప్రోమో అప్‍డేట్‍ను చెబుతుందా అనేది చూడాలి.
మెలోడీ రానుందా!
పుష్ప 2 నుంచి ఫస్ట్ సాంగ్ ఫుల్ మాస్ బీట్‍తో వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీప్రసాద్ జోష్ ఉన్న ట్యూన్ ఇవ్వగా.. అల్లు అర్జున్ హుక్ స్టెప్‍లతో ‘పుష్ప.. పుష్ప’ పాటకు అదిరిపోయింది. అయితే, ఇప్పుడు రానున్న రెండో పాట మెలోడీగా రానుందని తెలుస్తోంది. మెలోడియస్ ట్యూన్‍తో డ్యుయెట్‍గా ఈ సాంగ్ ఉంటుందని అంచనాలు బయటికి వచ్చాయి. అల్లు అర్జున్, హీరోయిన్ రష్మికతో ఈ పాట ఉండనుందని టాక్.
పుష్ప 2 చిత్రాన్ని భారీ యాక్షన్ సీన్లతో గ్రాండ్‍స్కేల్‍లో దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. 2021లో వచ్చి బంపర్ బ్లాక్‍బస్టర్‌తో దేశాన్ని షేక్ చేసిన పుష్పకు సీక్వెల్‍గా ఈ మూవీ రూపొందుతోంది. దీంతో పాన్ ఇండియా రేంజ్‍లో పుష్ప 2పై చాలా క్రేజ్ ఉంది. అల్లు అర్జున్ స్వాగ్, మేనరిజమ్స్, యాక్షన్ చూసేందుకు అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన ఈ చిత్రం రిలీజ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ భాషల్లో విడుదల కానుంది.
పుష్ప 2 సినిమా హిందీ ఉత్తరాది థియేట్రికల్ హక్కులు రూ.200కోట్లకు అమ్ముడైనట్టు సమాచారం బయటికి వచ్చింది. దీంతో బాలీవుడ్ హీరోలను దాటేసి ఈ విషయంలో ఉత్తరాదిలోనూ అల్లు అర్జున్ రికార్డు సృష్టించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ థియేట్రికల్ హక్కుల విషయంలో ఈ మూవీ రికార్డులను సృష్టిస్తుందనే అంచనాలు ఉన్నాయి. పుష్ప 2 చిత్రం సునాయాసంగా రూ.1000కోట్ల కలెక్షన్ల మార్కును దాటుతుందనే అంచనాలు ఉన్నాయి.
పుష్ప 2 చిత్రంలో అల్లు అర్జున్‍కు జోడీగా శ్రీవల్లి పాత్రలో రష్మిక నటిస్తున్నారు. ఫాహద్ ఫాజిల్, జగదీష్ ప్రతాప్ బండారీ, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేనీ, రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‍తో ఈ మూవీ రూపొందుతోంది.