The Fall Guy OTT: రెండు వారాల్లోనే ఓటీటీలో రిలీజైన హాలీవుడ్ గిన్నిస్ రికార్డ్ మూవీ – స్టార్ హీరోకు షాక్‌

Best Web Hosting Provider In India 2024

The Fall Guy OTT: హాలీవుడ్ స్టార్ హీరో ర్యాన్‌ గోస్లింగ్ హీరోగా న‌టించిన‌ న‌టించిన లేటెస్ట్ మూవీ ది ఫాల్ గాయ్ థియేట‌ర్ల‌లో రిలీజైన రెండో వారాల్లోనే ఓటీటీలోకి వ‌చ్చేసింది. యాక్ష‌న్ కామెడీ క‌థాంశంతో రూపొందిన ఈ సినిమా మే 3న థియేట‌ర్ల‌లో రిలీజైంది. సినిమా డిజాస్ట‌ర్‌గా నిల‌వ‌డంతో ప‌ద్దెనిమిది రోజుల్లోనే మేక‌ర్స్ ఓటీటీలో ది ఫాల్ గాయ్ మూవీని రిలీజ్ చేశారు. మంగ‌ళ‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ర్యాన్ గోస్లింగ్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

బార్బీ స‌క్సెస్ త‌ర్వాత‌…

ర్యాన్ గోస్లింగ్ హీరోగా న‌టించిన బార్బీ మూవీ అవార్డుల‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద విజ‌యాన్ని సాధించింది. బార్బీ సినిమాకు బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట‌ర్‌గా ఆస్కార్ అవార్డుకు ర్యాన్ గోస్లింగ్ నామినేట్ అయ్యాడు. బార్బీ త‌ర్వాత ర్యాన్ గోస్లింగ్ హీరోగా న‌టించిన ది ఫాల్ గాయ్ మూవీపై అభిమానులు భారీగా అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ కామెడీ వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డం, క‌థ‌లో లోపాల కార‌ణంగా ఈ సినిమా ఫెయిల్యూర్‌గా నిలిచింది.

ఎమిలీ బ్లంట్ హీరోయిన్‌…

ది ఫాల్ గాయ్ మూవీ లో ఓపెన్‌హైమ‌ర్ ఫేమ్ ఎమిలీ బ్లంట్ హీరోయిన్‌గా న‌టించింది. జాస‌న్ మోమోవా గెస్ట్ రోల్ చేశాడు. యాక్ష‌న్ కామెడీ క‌థాంశంతో ద‌ర్శ‌కుడు డేవిడ్ లీచ్ ఈ మూవీని తెర‌కెక్కించాడు. 1980లో హాలీవుడ్‌లో ఫేమ‌స్ అయిన ది ఫాల్ గాయ్ అనే సిరీస్ నుంచి స్ఫూర్తి పొందుతూ ద‌ర్శ‌కుడు అదే టైటిల్‌తో ఈ సినిమాను తెర‌కెక్కించాడు.

ది ఫాల్ గాయ్ క‌థ మొత్తం 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంద‌ని ద‌ర్శ‌కుడు సినిమాలో చూపించారు. కానీ సీన్స్ మొత్తం నేటి కాలాన్ని త‌ల‌పిస్తూ సాగ‌డం, యాక్ష‌న్ ఎపిసోడ్స్ లాజిక్స్ మిస్స‌వ్వ‌డంతో ఫ్యాన్స్ నుంచి విమ‌ర్శ‌లొచ్చాయి.

స్టంట్‌మ్యాన్‌గా ర్యాన్ గోస్లింగ్‌…

ది ఫాల్ గాయ్ మూవీలో ర్యాన్ గోస్లింగ్ సినిమా స్టంట్‌మ్యాన్‌గా ప‌నిచేసే యువ‌కుడిగా క‌నిపించాడు. హీరోల‌కు స్టంట్ డూప్‌గా ప‌నిచేసే అత‌డికి ఓ పెద్ద ప్ర‌మాదం జ‌రుగుతుంది. దాంతో స్టంట్‌మ్యాన్ కెరీర్‌కు దూర‌మ‌వుతాడు. .అనుకోని ప‌రిస్థితుల్లో త‌న మాజీ గ‌ర్ల్‌ఫ్రెండ్ డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇస్తోన్న మూవీకి ఆ స్టంట్‌మ్యాన్‌గా తిరిగి ప‌నిచేయాల్సివ‌స్తుంది?

అస‌లు వారిద్ద‌రు ఎలా విడిపోయారు?త‌న‌ను చంప‌డానికి ఓ హీరో ప్ర‌య‌త్నిస్తోన్న సంగ‌తి స్టంట్‌మ్యాన్‌కు ఎలా తెలిసింది? త‌న‌పై జ‌రుగుతోన్న కుట్ర‌ను ఎలా ఎదురించాడ‌న్న‌దే ది ఫాల్ గాయ్ మూవీ క‌థ‌. దాదాపు 127 మిలియ‌న్ డాల‌ర్ల బ‌డ్జెట్‌తో రూపొందించిన ఈ మూవీ 120 డాల‌ర్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

గిన్నిస్ రికార్డ్…

ది ఫాల్ గాయ్ మూవీ గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకున్న‌ది. యాక్ష‌న్ ఎపిసోడ్స్‌లో కెనాన్ రోల్స్ అనే స్టంట్ టెక్నిక్స్‌ను ఎక్కువ‌గా ఉప‌యోగించిన మూవీగా గిన్సిస్ బుక్‌లో ది ఫాల్ గాయ్ మూవీచోటు ద‌క్కించుకున్న‌ది.

ర్యాన్ గోస్లింగ్ ఇప్ప‌టివ‌ర‌కు మూడు సార్లు ఆస్కార్‌కు నామినేట్ అయ్యాడు. కానీ ఒక్క‌సారి కూడా అవార్డు రాలేదు. ఈ ఏడాది ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఓపెన్ హైమ‌ర్ సినిమాకుగాను బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట‌ర్‌గా ఎమిలీ బ్లంట్ కూడా ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. కానీ ఆమెకు కూడా అవార్డు రాలేదు.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024