Best Web Hosting Provider In India 2024
Brahmamudi May 22nd Episode: కష్టపడి మాయ అడ్రెస్ కనిపెడుతుంది కావ్య. డబ్బుల కోసమే బిడ్డను అడ్డంపెట్టుకొని సుభాష్‌ను బ్లాక్‌మెయిల్ చేసినట్లు కావ్య ముందు మాయ ఒప్పుకుంటుంది. మాయ ఆడుతోన్న నాటకానికి పుల్‌స్టాప్ పెట్టాలని కావ్య అవుతుంది. ఆమెను ఇంటికి తీసుకచ్చి అపర్ణ ముందు నిలబెడుతుంది. తన వల్ల దుగ్గిరాల ఇంట్లో కలతలు వచ్చాయని, తాను తప్పు చేసిన తప్పుకు క్షమించమని అందరిని మాయ కోరుతుంది.
తన వల్ల మొదలైన ఈ గొడవలను తిరిగి తానే చక్కదిద్దాలని ఇక్కడకు వచ్చానని అంటుంది. ఆ బిడ్డకు తల్లిని నేనే అని అంటుంది. మరి ఆ బిడ్డకు తండ్రి ఎవరు అని మాయను రుద్రాణి అడుగుతుంది. రాజ్ అని మాయ సమాధానమిస్తుంది. ఆమె మాటలతో కావ్య షాకవుతుంది. సుభాష్‌తో పాటు ఇంట్లోవాళ్లకు ఆమె ఏం చెబుతుందో అర్థం కాక చూస్తుండిపోతారు.
రాజ్‌కు దూరంగా…
నీకు మాటిచ్చినట్లే అజ్ఞాతంలో ఉండాలని కడుపుతీపిని చంపుకున్నాను. నా బిడ్డకు ఇంటి వారసత్వం వస్తే చాలని ఆశపడ్డాను. అందుకే నీకు, నా బిడ్డకు ఇద్దరికి దూరంగా ఉన్నానని రాజ్‌తో అంటుంది మాయ. కావ్య వచ్చి నన్ను కలిసిఇంట్లో గొడవల గురించి చెప్పింది. అందుకే నీ ముందుకు రాక తప్పలేదని రాజ్‌తో అంటుంది మాయ.
రెండో పెళ్లికి ఒప్పుకోని రాజ్…
తాను ఎవరు లేని అనాథనని, ఒంటరిగా బతుకుతోన్న తన జీవితంలోకి రాజ్ వచ్చాడని, అతడి కారణంగానే తాను తల్లిని అయినట్లు మాయ చెబుతుంది. రాజ్ నన్ను మోసం చేయడమే నమ్మకంతో ఈ బిడ్డకు జన్మనిచ్చాను. కానీ ఇంత పెద్ద కుటుంబంలోకి నన్ను తీసుకురావడానికి రాజ్‌కు ధైర్యం సరిపోలేదు. నా లాగా నా బిడ్డ అనాథగా పెరగకూడదని రాజ్‌ను బతిమిలాడుకున్నాను. కావ్య ఉండగా ఇంట్లోవాళ్లు రెండో పెళ్లికి ఒప్పుకోరని రాజ్ నన్ను దూరం పెట్టాడని కన్నీళ్లతో అందరిని బోల్తా కొట్టిస్తుంది మాయ.
న్యాయం చేసిన కావ్య…
తాను ఇంటికి దూరంగా ఉండాలని అనుకున్నానని, కావ్య వచ్చి తనకు న్యాయం చేస్తానని ఇంటికి తీసుకొచ్చిందని మాయ అంటుంది. ఇన్నాళ్లు కావ్య అంచనా నిజమవుతుందని అనుకున్నానని, రాజ్ నిరపరాధిగా పొరపడ్డానని రుద్రాణి సెటైర్స్ వేస్తారు. నువ్వు ఎంతో త్యాగమూర్తివి..ఇన్నాళ్లు సవతి బిడ్డను సొంత బిడ్డలా పెంచావు. ఇప్పుడు ఏకంగా సవతినే తీసుకొచ్చి అందరి ముందు నిలబెట్టావు. నీ ధైర్యాన్ని కొనియాడటానికి మాటలు కూడా రావడం లేదు. బిడ్డకు తల్లిని తెచ్చావో…రాజ్‌కు భార్యను తెచ్చావో…నీకు సవాతిని తెచ్చావో నాకైతే అర్థం కావడం లేదని రుద్రాణి అంటుంది.
తన గొయ్యి తానే తవ్వుకున్న కావ్య…
ఇన్నాళ్లు ఏం జరిగిందో ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు నిజం ఏమిటో తెలిసింది. మాయ బిడ్డకు తల్లి అని తేలింది. ఇప్పుడు ఆ తల్లిబిడ్డలకు న్యాయం చేస్తారా? కావ్యకు అన్యాయం చేస్తారా? ధాన్యలక్ష్మి అందరిని నిలదీస్తుంది. కావ్యకు ఎవరు అన్యాయం చేయాల్సిన పనిలేదు. తన గోయ్యి తానే తవ్వుకుంది. సౌభాగ్యాన్ని ఇంట్లో వదిలేసి దౌర్భగ్యాన్ని వెతికిపట్టుకొచ్చింది అంటూ రుద్రాణి తన నోటికి పనిచెబుతుంది.
ఇంటి కోడలిగా మాయకు స్థానం…
రాజ్ వల్ల బిడ్డకు తల్లి అయిన మాయకు మాత్రమే ఇంటి కోడలిగా స్థానం ఉంటుందని రుద్రాణి తీర్పు చెబుతుంది. రాజ్ చేసిన తప్పుకు నా చెల్లెలికి శిక్ష వేస్తే ఊరుకునేది లేదని స్వప్న అంటుంది. రుద్రాణి మాటల ప్రవాహానికి ఇందిరాదేవి అడ్డుకట్టవేస్తుంది.
అబద్ధాన్ని నిజం అనుకున్నావు…
నిజాన్ని అబద్దం అనుకున్నావు. అబద్దాన్ని నిజం అనుకున్నావు. చివరకు నీ స్థానాన్ని నువ్వే ప్రశ్నార్థకం చేసుకున్నావు అంటూ కావ్యకు క్లాస్ ఇస్తుంది ఇందిరాదేవి. కావ్య వైపు నుంచి ఏ తప్పు లేదని తీర్పు ఇస్తుంది. అగ్నిసాక్షిగా కావ్య మెడలో రాజ్ మూడు ముళ్లు వేశాడు. కావ్య స్థానాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికి లేదని ఇందిరాదేవి అంటుంది.
కావ్య కంగారు…
మాయ అబద్దం చెబుతుంది అని తెలిసిన కావ్య అడ్డుకోలేకపోతుంది. అసలు నిజాన్ని బయటపెడితే సుభాష్‌ను దోషిగా నిలబెట్టాల్సివస్తుంది. సుభాష్‌ను సమస్య నుంచి బయటపడేయబోయి తాను మరింత పెద్ద సమస్యను తీసుకొచ్చానా అని తనలో తానే మదనపడుతుంది.
అపర్ణ ఆవేదన..
అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియక అపర్ణ ఆవేదనకు లోనవుతుంది. ఇద్దరు అమ్మాయిల భవిష్యత్తుతో పాటు పసిబిడ్డకు సంబంధించిన సమస్య కావడంతో పరిష్కారం దొరకడానికి సమయం పడుతుందని, అప్పటివరకు మాయను మనింట్లోనే ఉండనిద్దామని సీతారామయ్య అంటాడు.
కావ్యపై రాజ్ ఫైర్…
కావ్యపై రాజ్ ఫైర్ అవుతాడు. ఏదో సాదిద్ధామని వెళ్లి ఇంకో సమస్యను మా నెత్తిన ఎందుకు పెట్టావని కావ్యపై కోప్పడుతాడు. ఆ మాయ ఎక్కడ…ఈ మాయలేడీ ఎక్కడ తగిలింది నీకు. బిడ్డకు తండ్రిని నేనే అనడం ఏమిటి? అంటూ కావ్యకు క్లాస్ ఇస్తాడు.
అసలు మాయ ఎక్కడ…
అసలు మాయ ఇంటి అడ్రెస్ నీకు ఇచ్చాను. ఆమెను కలవలేదా? అంటూ కావ్యను అడుగుతాడు సుభాష్. మీరు ఇచ్చిన ఇంటి అడ్రెస్ వెళ్లాను. తనే మాయ అని నన్ను నమ్మించింది. అదే నిజమని నమ్మి ఇంటికి తీసుకొచ్చామని రాజ్‌తో చెబుతుంది కావ్య. నీలాగే నేను మోసపోయానని, ఆమె మాయ కాదని నాకు తెలియదు సరే. మీకు మాయ ఎవరో తెలిసినప్పుడు ఎందుకు చెప్పలేదు అని రాజ్‌ను నిలదీస్తుంది కావ్య. ఆ తర్వాత అక్కడ జరిగింది మొత్తం కావ్య బయటపెడుతుంది.
బిడ్డకు సుభాష్‌తో సంబంధం లేదు…
బిడ్డకు , సుభాష్‌కు ఏం సంబంధం లేదని తన ఇంట్లో చెప్పిందని, ఇక్కడకు వచ్చి మాట మార్చేసిందని కావ్య బాధపడుతుంది. అయినా కావ్యపై రాజ్ కోసం చల్లరదు. ఎంత చెప్పిన ఆమె మాటలకు కన్వీన్స్ కాడు. మాయ నిజస్వరూపం బయటపెట్టి తానే ఇంట్లో నుంచి ఆమెను బయటకు పంపిస్తానని కావ్య అంటుంది. ఆ అవసరం లేదని రాజ్ అంటాడు.
రుద్రాణి ప్లాన్…
నకిలీ మాయ ఇంట్లోకి రంగప్రవేశం చేయడం వెనుక రుద్రాణి అంటుంది. నకిలీ మాయ చేత రుద్రాణినే ఈ నాటకం ఆడిస్తుంది. రుద్రాణి, మాయ మాట్లాడుకుంటుండగా కావ్య వింటుంది. ఆమెను చూసి మాయతో పాటు రుద్రాణి షాకవుతారు.