Best Web Hosting Provider In India 2024
NNS 22nd May Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం బుధవారం (మే 22) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మిస్సమ్మను ఎందుకు తీసుకురాలేదని అమర్‌ని అడుగుతుంది నిర్మల. తను చేసిన మోసాన్ని తీసుకోలేకపోతున్నానమ్మా.. అందుకే ఇక తనతో బంధం వద్దని వదిలేసుకుని వచ్చాను అంటాడు అమర్. నీకు, మిస్సమ్మకు పెళ్లి నీ తలరాతలో ఉంది, దాన్ని నువ్వు మార్చలేవు అంటుంది నిర్మల.
చూద్దాం.. నా నిర్ణయం నిలుస్తుందో, నువ్వు చెప్పే తలరాత నిలుస్తుందో, ఇక నుంచి మిస్సమ్మకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం అంటూ లోపలకు వెళ్తాడు అమర్. సంబరపడిపోతూ లోపలకు వెళ్తుంది మనోహరి. పరిగెత్తుకుంటూ వచ్చిన నీల మనోహరి కాళ్లపై పడి మీరు చాలా గ్రేట్ అమ్మా అని కాకాపడుతుంది. వేషాలు చాలుగానీ వెళ్లి డిన్నర్‌కి ప్రిపేర్ చెయ్ అంటుంది మనోహరి.
డాక్టర్‌ను నిలదీసిన రాథోడ్
అమర్, రాథోడ్.. సరస్వతిని చూడటానికి హాస్పిటల్‌కి వెళ్తారు. సరస్వతి స్పృహలో లేదని అంటుంది డాక్టర్. నాకో సందేహం, మీరేమననంటే అడుగుతాను అంటాడు రాథోడ్. అమర్ సరే అనడంతో.. అసలు ఏం జరిగింది డాక్టర్, నిన్న మీరే ఫోన్ చేసి మేడమ్‌కి స్పృహ వచ్చింది అన్నారు, ఎక్కడికో వెళ్లింది అన్నారు, మళ్లీ మీరే ఫోన్ చేసి ఆమే వచ్చింది అన్నారు..
మళ్లీ ఇప్పుడు స్పృహలో లేదంటున్నారు.. అసలేం జరుగుతోంది అంటాడు రాథోడ్. అదేంటి సార్ అలా అడుగుతున్నారు, మేం అబద్ధం చెబుతున్నామనుకుంటున్నారా? మాకేం అవసరం సార్ అంటుంది డాక్టర్. రాథోడ్ తెలీక మాట్లాడాడు ఏం అనుకోకండి డాక్టర్ అంటాడు అమర్.
అమర్, రాథోడ్ వాదన
ఏంటి రాథోడ్.. ఎందుకు డాక్టర్‌తో అలా మాట్లాడావు అంటాడు. అది కాదు సర్.. ఈ డాక్టర్ సరస్వతి మేడమ్ రాత్రే వచ్చారు అంటున్నారు.. కానీ మిస్సమ్మ మేడమ్‌ని వాళ్లింట్లో చూశాను అంటోంది.. అంటే ఆ డాక్టర్ మనదగ్గర ఏదో దాస్తుంది అన్నట్లే కదా సార్ అంటాడు రాథోడ్.
మనుషుల్ని నమ్మడం మంచిదే కానీ మరీ అంత గుడ్డిగా నమ్మొద్దు రాథోడ్ అంటాడు అమర్. మిస్సమ్మను నమ్మచ్చేమో సార్, తనని మనం వదిలేసి వచ్చి తప్పు చేశామేమో అంటాడు రాథోడ్. సరే రాథోడ్ నేను మిస్సమ్మను నమ్ముతాను, తను చూపించే అభిమానం, ప్రేమను నమ్ముతాను.
కానీ నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. పెళ్లిలో మనోహరి స్థానంలో మిస్సమ్మ ఎందుకు ఉంది? నన్ను మోసం చేసి ఎందుకు పెళ్లి చేసుకుంది? అనే ప్రశ్నలకు సమాధానం దొరికినప్పుడు నేనూ మిస్సమ్మను ద్వేషించడం మానేస్తాను, నువ్వు మిస్సమ్మను చెల్లిగా అభిమానిస్తావని నాకు తెలుసు, కానీ అంత గుడ్డిగా నమ్మడం, వేరే వాళ్లని అనుమానించడం మంచిది కాదు అంటూ అక్కడనుంచి వెళ్లిపోతాడు అమర్.
అమర్ ఇంటికి వెళ్లనంటున్న భాగీ
జరిగినదాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది భాగీ. ఏదేమైనా నువ్వు చేసింది తప్పమ్మా.. బాబుగారు వెళ్లినప్పటినుంచీ ఫోన్ కూడా లేదు, నువ్వైనా ఫోన్ చేసి క్షమించమని అడుగమ్మా అంటాడు రామ్మూర్తి. భాగీ ఎందుకు క్షమాపణ అడగాలి, ఏం తప్పు చేసింది? చూసిందే చెప్పింది కదా.. అంటుంది మంగళ. కాపురాలు కూల్చడానికి ముందుంటావని తెలుసుగానీ, చూస్తూ చూస్తూ నా కూతురు కాపురం కూలుస్తానంటే చూస్తూ ఊరుకోను లోపలకు వెళ్లు అని కసురుతాడు రామ్మూర్తి.
ఏంటి నాన్నా.. చిన్నప్పటినుంచీ తప్పు చేయకుంటే భయపడకూడదని చెప్పిన మీరే ఇప్పుడు నా తప్పు లేకుండా క్షమాపణ చెప్పమంటున్నారు. మేమిద్దరం గొడవపడితే నేను ఓ మెట్టు తగ్గైనా క్షమాపణ చెబుతా నాన్నా.. కానీ ఆయన నన్ను నమ్మలేదు. నేను తప్పు చేయలేదని నిరూపించుకునేవరకు ఆ ఇంటికి వెళ్లను అంటుంది భాగీ.
అందరూ అక్కడే ఉంటే నువ్వు ఇక్కడనుంచి ఎలా నిరూపిస్తావమ్మా? అంటాడు రామ్మూర్తి. అంతా విన్న అరుంధతి ఎలాగైనా మిస్సమ్మను ఇంటికి పంపించాలనుకుంటుంది. గుప్తాతో కోయదొర వేషం వేయించి రామ్మూర్తి, మంగళను మాటల్లో పెట్టి తను వెళ్లి భాగీతో మాట్లాడుతుంది. అరుంధతి మాటల్లో నిజాన్ని అర్థం చేసుకున్న భాగీ అమర్ ఇంటికి వెళ్లేందుకు ఒప్పుకుంటుంది. అరుంధతి ఏం చెప్పి భాగీని ఒప్పించింది? భాగీని అమర్ ఇంట్లోకి రానిస్తాడా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు మే 22న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!