ఎన్టీఆర్ జిల్లా / నందిగామ నియోజకవర్గం :
నందిగామ నియోజకవర్గంలో కొత్తగా 1910 పెన్షన్లు మంజూరు ..
నందిగామ రూరల్ – 235
నందిగామ టౌన్ – 206
చందర్లపాడు – 486
కంచికచర్ల టౌన్ మరియు రూరల్ – 643
వీరులపాడు – 340 .
మొత్తం నందిగామ నియోజకవర్గం లో కొత్తగా మంజూరైన పింఛన్లు -1910 …
గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలు చెప్పిన వారికే పెన్షన్లు ..
కానీ నేడు రాష్ట్రంలో వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పార్టీలు -రాజకీయాలు, కుల- మతాలతో పనిలేకుండా పెన్షన్లు మంజూరు : ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన పెన్షన్లను చందర్లపాడు గ్రామంలో -కంచికచర్ల పట్టణంలో – వీరులపాడు మండలం లోని జుజ్జూరు గ్రామంలో లబ్ధిదారులకు శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు పంపిణీ చేశారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని , అన్ని వర్గాల -రంగాల ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా అర్హతే ప్రామాణికంగా పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు , గత ప్రభుత్వాలు కు భిన్నంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారని , ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ అనతి కాలంలోనే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారన్నారు ,
ఈ కార్యక్రమంలో చందర్లపాడు ఎంపీపీ వేల్పుల ఏసమ్మ , జడ్పిటిసి ముక్కపాటి నరసింహారావు, సర్పంచ్ కస్తాల పున్నమ్మ , కంచికచర్ల సర్పంచ్ వేల్పుల సునీత , ఉప సర్పంచ్ వేమ సురేష్ బాబు , జడ్పిటిసి వేల్పుల ప్రశాంతి ,వైస్ ఎంపీపీ బండి మల్లికార్జున రావు , వీరులపాడు ఎంపీపీ కోటేరు లక్ష్మి , జడ్పిటిసి అమర్లపూడి కీర్తి సౌజన్య , షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షహనాజ్ బేగం , పార్టీ నాయకులు పరిటాల రాము , రాయల నరసింహారావు , యార్లగడ్డ సత్యనారాయణ ప్రసాద్ , కందుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ..