
తాడేపల్లి: ఉన్నత విద్యాశాఖపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కే. ఎస్. జవహర్ రెడ్డి, విద్యాశాఖ సలహాదారు ఏ. సాంబశివారెడ్డి, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు, ఆర్‌జీయూకేటీ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కే. సి. రెడ్డి, కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె. హేమచంద్రారెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.