రైతులకు మేలు చేసేలా ధాన్యం కొనుగోలు విధానం…….మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

విజయవాడ: రైతులకు మేలు చేసేలా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధాన్యం కొనుగోలు విధానాన్ని తీసుకొచ్చారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్పారు. చంద్రబాబు హయాంలో కంటే అధికంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని అన్నారు. మూడున్నరేళ్లలోనే 2 కోట్ల 88 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఇప్పుడు దళారులు, మిల్లర్లతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు.

మంత్రి మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి నష్టం రాకుండా నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. దళారి వ్యవస్థని పూర్తిగా నిర్మూలించాం. ధాన్యం డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో జమచేశాం. టీడీపీ రైతుల్ని రెచ్చగొట్టినా వారు మా నిర్ణయానికే మద్దతు తెలిపారు. ప్రతి రైతుకు ఎకారానికి అదనంగా రూ.8వేలు లబ్ధి కలిగింది. ప్రతిపక్షాలకు చెందిన రైతులు కూడా సీఎం జగన్‌కి హ్యాట్సాఫ్ చెప్తున్నారు. కొందరు మిల్లర్లు తోక జాడిస్తే వారిపై చర్యలు తీసుకున్నాం. ఈ వ్యవస్థను మరింత బలోపేతం చెయ్యాలని సీఎం ఆదేశించారు.

రైతులను మిల్లర్లు ఎవరైనా ఇబ్బంది పెడితే ఫిర్యాదు కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశాము. కొద్ది మంది మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడుతున్నారు. వారిపై చర్యలు తప్పవు. 21 రోజులు కాకుండానే రైతులకు డబ్బులు జమ చేస్తున్నాం. టీడీపీకి చెందిన పచ్చ పత్రికలకు కళ్ళు మండుతున్నాయి. చంద్రబాబు రైతుకి గిట్టుబాటు ధర కల్పించనప్పుడు పచ్చ పత్రికలు ఏం చేశాయి. ఈనాడు రామోజీరావుకి వయస్సు వచ్చినా స్వార్థంతో ఆలోచిస్తున్నారు. చంద్రబాబుని సీఎం చేసి దోచుకోవాలన్న ఆలోచనలో రామోజీరావు ఉన్నారు అంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *