తాడేపల్లి: ఉన్నత విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీకి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గురువారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉన్నత విద్యాశాఖపై సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు.
డిగ్రీ చదువుతున్నవారి నైపుణ్యాలను బాగా పెంచాలి.
- వివిధ కోర్సులను పాఠ్యప్రణాళికలో ఇంటిగ్రేట్ చేయాలి. విదేశాల్లో విద్యార్థులకు అందిస్తున్న వివిధ కోర్సులను పరిశీలించి వాటిని కూడా ఇక్కడ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలి.
- జాబ్ ఓరియెంటెడ్ కరిక్యులమ్ ఉండాలి.
- సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ కరిక్యులమ్‌లో భాగం కావాలి.
- ఈ తరహా కోర్సుల వలన డిగ్రీ పూర్తయ్యేనాటికి స్వయం ఉపాధి అందుతుంది.
- ప్రఖ్యాత కాలేజీల కరిక్యులమ్ చూసి, వాటిని మన దగ్గర అమలయ్యేలా చూడాలి.
- స్వయం ఉపాధిని కల్పించే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ వంటి సంస్ధలతో ఈ కోర్సుల కోసం టైఅప్ చేసుకోవాలి.
- రిస్క్ ఎనాలసిస్, బ్యాంకింగ్, రిస్క్ మేనేజిమెంట్, రియల్ ఎస్టేట్ వంటి కోర్సులపై దృష్టి పెట్టాలి.
- వచ్చే జూన్ కల్లా పాఠ్యప్రణాళికలో ఈ కోర్సులు భాగం కావాలి.
ఉన్నత విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం.
- ఈ ఖాళీల భర్తీపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.
- కోర్టు కేసులను వీలైనంత త్వరగా పరిష్కారం చేసుకుని జూన్‌కల్లా నియామక ప్రక్రియను ప్రారంభించేలా చూడాలి.
- ఉన్నత విద్యాశాఖలో పెద్ద ఎత్తున సంస్కరణలు చేపడుతున్నాం… ఈ నేపధ్యంలో సిబ్బంది భర్తీ కూడా త్వరితగతిన చేపట్టాలి.
- ఆ మేరకు మరింత చురుగ్గా పనిచేయాలి.
ఉన్నత విద్యాశాఖ పరిధిలోని ప్రతి కాలేజీలో కూడా బోధనపరంగా, వసతులు పరంగా నాణ్యత పెరగాలి.
- ప్రతి విద్యాసంస్థ కూడా నాక్ అక్రిడిటేషన్ సాధించాలి. మూడేళ్లలో కాలేజీల ప్రమాణాలు పెంచుకునేలా వారికి చేయూత నివ్వాలి. ఒక్కో ఏడాది ఒక్కో లక్ష్యాన్ని అందుకుంటూ మూడేళ్లలో ప్రమాణాలు పెంచుకోవాలి.
- మూడేళ్ల తర్వాత కచ్చితంగా ఉన్నత విద్యాశాఖలోని విద్యాసంస్థలు నాక్ అక్రిడిటేషన్ సాధించాలి.
- అలా సాధించలేని పక్షంలో సంబంధిత కాలేజీల గుర్తింపును రద్దు చేయాలి.
- అప్పుడే విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందుతుంది.
- కళాశాలల్లో కోర్సులన్నీ ఇవాల్టి అవసరాలకు తగిన విధంగా రూపొందించాలి.
- కళాశాలలకు అనుమతుల విషయంలో కూడా యూనిఫామ్ పాలసీ ఉండాలి.
- వివిధ కోర్సులకు సంబంధించిన కరిక్యులమ్ అందించే బాధ్యత స్కిల్ యూనివర్సిటీ తీసుకోవాలి.
- నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం.
- ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉన్న పరిశ్రమలకు అనుగుణంగా కోర్సులు ఏర్పాటు చేయాలి.
- హై ఎండ్ స్కిల్స్‌లో భాగంగా.. సాప్ట్వేర్ స్కిల్స్‌ను కూడా అభివృద్ధి చేయాలి.
- కోడింగ్, క్లౌడ్ సర్వీసెస్లాంటి డిమాండ్ ఉన్న కోర్సులపై దృష్టి పెట్టాలి.
- విద్యార్ధులకు సర్టిఫికేషన్‌ఉంటేనే ఎంప్లాయిమెంట్ పెరుగుతుంది.
- ఐటీ, స్కిల్ డెవలప్మెంట్ శాఖలు కలిపి కరిక్యులమ్ రూపొందించాలి.
- సోలార్ పార్క్‌లు, సోలార్ మోటార్లు, ప్యానెల్స్ రిపేరు వంటి వాటిలో నైపుణ్యం కొరత చాలా ఎక్కువగా ఉంది.
- ప్రతి నియోజకవర్గంలో ఇవి అందుబాటులో ఉండాలి.
- ఈ మేరకు కోర్సులు, కరిక్యులమ్, శిక్షణ ఉండాలి.
- వచ్చే జూన్ లక్ష్యంగా ఈ తరహా కోర్సులు ఏర్పాటు చేయాలి.
- కొన్ని ప్రైవేటు బీఈడీ కాలేజీల్లో బోధన, వసతులు తీసికట్టుగా ఉన్నాయని, మరికొన్ని కాలేజీలు మోసపూరిత చర్యలకు దిగుతున్నాయని సమావేశంలో చర్చ.
- బోధన సిబ్బంది, వసతి, సౌకర్యాలను ప్రమాణంగా తీసుకోవాలని, అందులో చదివే విద్యార్థుల హాజరును మరొక ప్రమాణంగా తీసుకుని.. ఆయా కాలేజీలపై ఒక నిర్ణయానికి రావాలన్న సీఎం.
- బోధన సిబ్బంది సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి తిరుపతి, విశాఖపట్నంలో ఉన్న అకడమిక్ స్టాఫ్ కాలేజీని బలోపేతం చేయడం సహా సెంట్రల్ ఆంధ్రా పరిధిలో ఒక చోట అకడమిక్ స్టాఫ్ కాలేజీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశం. పిల్లలు చదువులు ప్రారంభించిన తర్వాత ఏ దశలోనూ డ్రాప్ అవుట్ అన్న పరిస్థితే రాకుండా ఈ ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంది.
- పిల్లలను బడికి పంపితే చాలు.. నేరుగా తల్లి అకౌంట్లోకి అమ్మ ఒడి పథకం ద్వారా డబ్బు జమచేస్తోంది.
- టెన్త్ తర్వాత ఐటీఐ, పాలిటెక్నిక్ వైపు వెళ్తున్న వారికి కూడా విద్యాదీవెన, వసతి దీవెన అమలు చేస్తోంది.
- ఇక మెడిసిన్, ఇంజనీరింగ్ వంటి ఇతర చదువులు చదువుతున్న వారికి పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అందిస్తోంది.
- సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను దేశంలో అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదే.
- అలాగే వసతి దీవెన కూడా అందిస్తున్న రాష్ట్రంకూడా ఏపీయే.
- ఈ కార్యక్రమాల వల్ల ఎక్కడా కూడా చదువులు మానేయాల్సిన పరిస్థితి అన్నది లేదు.
- ఫలితంగా జీఈఆర్ రేషియో తప్పకుండా పెరుగుతుంది.
- సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యాల సాధనలో ఇవి ప్రతిబింబించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
- యూనివర్శిటీల్లో రిక్రూట్మెంట్కు సంబంధించి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయడంపై ఆలోచన చేయాలి.
- సమర్థులైన బోధనా సిబ్బందిని నియమించేందుకు, తద్వారా బోధనా ప్రమాణాలను విశ్వవిద్యాలయాల్లో పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి.
ట్రిపుల్ ఐటీలపైనా సీఎం సమీక్ష.
ట్రిపుల్ ఐటీలలో సిబ్బంది నియామకం, ఇతర పెండింగ్ అంశాలను సత్వరమే పరిష్కరించాలని సీఎం ఆదేశం.
ఈ సమీక్షా సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కే ఎస్ జవహర్ రెడ్డి, విద్యాశాఖ సలహాదారు ఏ సాంబశివారెడ్డి, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు, ఆర్జీయూకేటీ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కే సి రెడ్డి, కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.