ఓట‌మి భ‌యంతో దొంగ ఓట్ల న‌మోదుకు తెగ‌బ‌డుతున్న టీడీపీ ….వైవీ సుబ్బారెడ్డి

 

విశాఖపట్నం: ఓటమి భయంతో ప్రతిపక్ష తెలుగుదేశం సాగిస్తున్న దొంగ ఓట్ల నమోదు కార్యక్రమాన్ని అడ్డుకొని, టీడీపీకి త‌గిన గుణ‌పాఠం చెప్పాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజ‌న‌ల్ కోఆర్డినేట‌ర్‌, టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు. మద్దిలపాలెంలోని వైయ‌స్ఆర్ సీపీ కార్యాలయంలో దక్షిణ నియోజకవర్గ వైయ‌స్ఆర్ సీపీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి వైవీ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. బూత్ స్థాయిలో తెలుగుదేశం నమోదు చేయిస్తున్న దొంగ ఓట్లను అడ్డుకోవాల‌ని సూచించారు. అవినీతికి తావులేకుండా పథకాలు అందిస్తున్న ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్‌పై చంద్రబాబు, పవన్ కల్యాణ్, పచ్చ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మితే రాష్ట్రంలోని కోట్లాది మంది పేద ప్రజానీకం పథకాలకు దూరమైపోతారన్నారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలు, అభివృద్ధి గురించి ఇంటింటికీ వెళ్లి తెలియజేయాల‌ని, పార్టీని బలోపేతం చేయాలని కోరారు.

2024 ఎన్నికల్లో విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యేగా వాసుపల్లి గణేష్ కుమార్ ను గెలిపించాలని పార్టీ రీజ‌న‌ల్ కోఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి కార్య‌క‌ర్త‌ల‌కు సూచించారు. ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ నిర్ణయించిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి కార్యకర్తలు కంకణ బద్ధులై ఉండాలని కోరారు. వైయ‌స్ జ‌గ‌న్‌ను మ‌ళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి పార్టీ కేడర్ చిత్తశుద్ధితో ప‌నిచేయాల‌న్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలు, పార్టీ విషయాలను పార్టీ నాయకులతో వైవీ సుబ్బారెడ్డి చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *