తాడేపల్లి: చంద్రబాబు, లోకేష్‌ల కంటే పెద్ద సైకోలు ఎవరూ ఉండరని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు విమర్శించారు. వాళ్లిద్దరిని మించిన సైకో అయ్యన్నపాత్రుడని దుయ్యబట్టారు.టీడీపీ నేతలు పిచ్చిపట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.వారికి ప్రజా సమస్యలు పట్టవని, ఉనికి కోసం పిచ్చి ప్రేలాపనలు చేస్తుంటారని ఫైర్ అయ్యారు. మూడున్నరేళ్లలో ప్రజల కోసం ఎప్పుడైనా చంద్రబాబు మాట్లాడారా అని నిలదీశారు. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి పిచ్చి పట్టిందా అని మండిపడ్డారు. పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ సంతృప్తస్థాయిలో సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు, లోకేష్‌లు పెద్ద సైకోలు. బాధ్యత కలిగిన ప్రతిపక్షంలో ఉండి రాష్ట్ర ప్రజలకు మేలు చేసేందుకు ప్రభుత్వాన్ని డిమాండు చేయాల్సిన నీవు..ఏ రోజైనా నీవు రాష్ట్ర ప్రజల గురించిమాట్లాడావా? ఎన్నికలు సమీపిస్తున్నాయి. మీ తాలుకా ఉనికి చాటుకోవాలనే ధ్యాస తప్ప..మీ మాటల్లో ఎప్పుడైనా రాష్ట్రానికి మేలు చేసేలా సలహాలు, సూచనలు ఇచ్చారా?
మీ మాటల్లో సైకో విధానం ఉంది. మీ మాటల్లో అభద్రతాభావం కనిపిస్తోంది. టీడీపీ పాలనలో మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలు మాత్రమే అసెంబ్లీలో ప్రస్తావించేవాళ్లం. అప్పుడు కూడా ఇవే ప్రేలాపనలు. అసలు అసెంబ్లీలో కూడా అడుగుపెట్టలేరని మాట్లాడారు. మీ మాట విధానం, మా మాట విధానం, మీ పరిపాలనా విధానం, మా పరిపాలన విధానాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు.
ఆ రోజు అధికారంలో ఉండి జన్మభూమి కమిటీలతో దోచుకున్నారు. రాష్ట్రంలో ఉన్న మట్టి దగ్గర నుంచి ఇసుక, గనులు అన్నీ కూడా అడ్డగోలుగా అమ్మేశారు కాబట్టి మీకు ప్రజలు గుణపాఠం చెప్పారు.
ప్రజలు ఏడుస్తుంటే..వైయస్ జగన్ నవ్వుతున్నారని ఈ రోజు మాట్లాడుతున్నారు.
చంద్రబాబు అధికారంలోకి రావడానికి 2014లో యువకులను, బీసీలను, రైతులను, డ్వాక్రా అక్కచెల్లెమ్మలను వాడుకున్నారు. వారికి అనేక రకాలుగా ఆశలు కల్పించారు. రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక రైతులను, మహిళలను, యువతను దగాచేసిన వ్యక్తి చంద్రబాబు. మీ వల్ల మోసపోయిన ప్రజలంతా ఏడుస్తుంటే..చంద్రబాబు, పప్పు,దద్దమ్మ అయిన లోకేష్ పైశాచిక ఆనందం పొందారు.
ఈ రోజు రాష్ట్ర ప్రజలకు మంచి చేసే ఆలోచనతో మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 98 శాతం అమలు చేసిన ఘనత వైయస్ జగన్ మోహన్ రెడ్డిది. సీఎం వైయస్ జగన్ సంక్షేమ పాలన చూసి ఓర్వలేకపోతున్నారు.
గత పాలనలో ఐదేళ్లు టీడీపీ చేసిన దోపిడీకి, పశువులను కొన్నట్లుగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు కాబట్టి భగవంతుడు ప్రజల రూపంలో మీరు కొన్న 23 ఎమ్మెల్యేలు, మూడు ఎంపీ స్థానాలు టీడీపీకి ఇచ్చారు.
ఈ రోజు ఎన్నికల్లో ఇచ్చిన మాట తప్పకుండా మంచి సువర్ణ పాలన అందిస్తున్న వైయస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని రాష్ట్ర ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. మాపై విశ్వాసం ఉంచి వైయస్ఆర్సీపీని అధికారంలోకి తెచ్చింది ప్రజలు మాత్రమే..చంద్రబాబు, పప్పులు కాదు. అందరికీ సంక్షేమ పథకాలు శాచురేషన్ పద్ధతిలో అందజేస్తున్నాం.
అయ్యన్నపాత్రుడికి నిజంగా పిచ్చి పట్టిందా?. అప్పుడే ఎన్నికలు అయిపోయినట్లు, టీడీపీ అధికారంలోకి వచ్చినట్లు, అయ్యన్నకు హోం శాఖ ఇచ్చినట్లు, ఆయన ఆ కూర్చిలో కూర్చున్నట్లు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. పోలీస్ యంత్రాంగం ఏ ప్రభుత్వం ఉన్నా కూడా శాంతిభద్రతలు కాపాడుతారు. ప్రజలకు రక్షణ కల్పిస్తారు. టీడీపీ సమావేశాలు పెట్టుకుంటే మాకు భయమేందుకు, ప్రజలు అసహ్యించుకుంటున్నారు. టీడీపీ తీరు కా రణంగానే కందుకూరు, గుంటూరులో 11 మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్నారు. చట్టబద్ధంగా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది.
టీడీపీ పాలనలో వైయస్ జగన్ విశాఖలో కొవ్వొత్తుల ర్యాలీ కోసంవెళ్తే ఎయిర్ పోర్టు నుంచి వెనక్కి పంపించారు. పోలీసులు పెట్టిన విధానంగా మేం ఆ రోజు గౌరవించాం.