Sleeping Mask : రాత్రంతా స్లీపింగ్ మాస్క్ ఉపయోగించడం మంచి పద్ధతేనా? తెలుసుకోండి

Best Web Hosting Provider In India 2024

నేటి కాలంలో ప్రతి వ్యక్తి తన కోసం సమయం కూడా లేని విధంగా బిజీగా ఉన్నారు. అటువంటి పరిస్థితిలో చర్మాన్ని చూసుకోవడం ఇబ్బంది అవుతుంది. దానికోసం సరైన సమయం కేటాయించేందుకు టైమ్ ఉండటం లేదు. దీని కారణంగా రాత్రి చర్మ సంరక్షణకు ఉత్తమ సమయంగా చాలా మంది పరిగణిస్తారు. మీరు రాత్రి నిద్రిస్తున్నప్పుడు మీ చర్మానికి స్లీపింగ్ మాస్క్ ఉపయోగిస్తున్నారా? అయితే కొన్ని విషయాలు తెలుసుకోండి.

రాత్రిపూట చర్మ సంరక్షణ దినచర్యలో స్లీపింగ్ మాస్క్‌లను ఉపయోగించే ధోరణి చాలా పెరిగింది. ఇవి ఒక రకమైన ఓవర్నైట్ మాస్క్‌లు, ఇవి రాత్రిపూట చర్మంపై పెడతారు. మరుసటి రోజు ఉదయం కడిగేస్తారు.

ఈ స్లీపింగ్ మాస్క్‌లు చర్మాన్ని మృదువుగా చేస్తాయి. కొంతమంది ప్రతిరోజూ స్లీపింగ్ మాస్క్‌లను ఉపయోగించడం చేస్తారు. అయితే ప్రతి రాత్రి స్లీపింగ్ మాస్క్ ఉపయోగించడం సరైనదా లేదా అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. ప్రతిరోజూ స్లీపింగ్ మాస్క్ ధరించడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకోండి..

స్లీపింగ్ మాస్క్ ఎలా ఉపయోగించాలో తెలుసుకునే ముందు, స్లీపింగ్ మాస్క్ గురించి తెలుసుకుందాం. నిజానికి, స్లీపింగ్ మాస్క్ అనేది కొరియన్ చర్మ సంరక్షణ ఉత్పత్తి. ఇది మీరు రాత్రి నిద్రిస్తున్నప్పుడు చర్మానికి తేమను, పోషణను అందించడానికి ఉపయోగించే మాస్క్. సాధారణంగా స్లీపింగ్ మాస్క్‌లు లైట్ క్రీమ్ లేదా జెల్ లాగా ఉంటాయి. ఇది చర్మం హైడ్రేషన్ స్థాయిని కూడా పెంచుతుంది. స్లీపింగ్ మాస్క్ ఉపయోగించడం ద్వారా చర్మం వృద్ధాప్య సంకేతాలను తగ్గించవచ్చు. అదే సమయంలో చర్మం నష్టాన్ని సరిచేయడంలో కూడా సహాయపడతారు.

మంచివే కానీ.. అతిగా వద్దు

స్లీపింగ్ మాస్క్‌లు మీ చర్మాన్ని మరింత ఆరోగ్యవంతంగా, ప్రకాశవంతంగా మారుస్తాయనడంలో సందేహం లేదు. అయితే దీన్ని ప్రతిరోజూ ఉపయోగించడం సరైనదా కాదా అని కూడా మీరు తెలుసుకోవాలి. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఎక్కువగా వాడటం వల్ల చర్మానికి హాని కలిగించినట్లే, స్లీపింగ్ మాస్క్‌ల విషయంలో కూడా అదే జరుగుతుంది. అయితే స్లీపింగ్ మాస్క్‌లు చాలా పోషకాలను కలిగి ఉంటాయి. తగినంత తేమను కూడా కలిగి ఉంటాయి. కానీ తరచుగా స్లీపింగ్ మాస్క్‌లను ఉపయోగిస్తే, అవి ఇబ్బంది కలిగిస్తాయి.

ఎక్కువగా వాడొద్దు

మెరుగైన ఫలితాలను పొందడానికి మీరు ప్రతిరోజూ స్లీపింగ్ మాస్క్‌ని ఉపయోగించడం ప్రారంభిస్తే చర్మంపై ప్రతికూల ప్రభావాలు కనిపించడం ప్రారంభిస్తాయి. మీ చర్మం ఎక్కువ నూనెను ఉత్పత్తి చేయడం ప్రారంభించే అవకాశం ఉంది. దీని కారణంగా దాని సహజ తేమను కోల్పోతుంది. మెుటిమలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందువల్ల మీరు ఎల్లప్పుడూ వాతావరణం, మీ చర్మ రకాన్ని దృష్టిలో ఉంచుకుని స్లీపింగ్ మాస్క్‌ని ఉపయోగించాలి.

వారానికి ఎన్నిసార్లు ఉపయోగించాలి?

ఒక వారంలో మీరు స్లీపింగ్ మాస్క్‌ని ఎన్నిసార్లు ఉపయోగించాలి అనేది పూర్తిగా మీ చర్మం అవసరాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీ చర్మం జిడ్డుగా ఉంటే మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది. సున్నితంగా ఉంటే, మీరు వారానికి 1 నుండి 2 సార్లు మాత్రమే స్లీపింగ్ మాస్క్‌ని ఉపయోగించాలి. అదే సమయంలో మీ చర్మం పొడిగా ఉంటే, దానికి మరింత తేమ అవసరం. ఈ రకమైన చర్మానికి అదనపు పోషణను అందించడానికి, స్లీపింగ్ మాస్క్‌ని నైట్ కేర్ రొటీన్‌లో భాగంగా చేసుకోవడం మంచిది.

మీరు స్లీపింగ్ మాస్క్‌ని వారానికి 2-3 సార్లు ఎటువంటి సమస్య లేకుండా ఉపయోగించవచ్చు. అయితే మీకు ఏవైనా చర్మ సంబంధిత సమస్యలు ఉంటే మొదట చర్మ సంరక్షణ నిపుణుడిని కలుసుకుని, అతని సలహా మేరకు మాత్రమే స్లీపింగ్ మాస్క్‌ని ఉపయోగించడం మంచిది.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024