Best Web Hosting Provider In India 2024
25 May 2024 10:14 PM
మంగళగిరి: ఎన్నికల సమయం, ఆ తరువాత రాష్ట్రంలో జరిగిన పలు ఘటనలపై ఏపీ డీజీపీకి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. శనివారం సాయంత్రం వైయస్ఆర్‌సీపీ నేతలు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణమూర్తి డీజీపీని కలిసి పలు అంశాలపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో హింసకు పాల్పడుతూ, రెచ్చగొడుతున్న టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.