Best Web Hosting Provider In India 2024
Palnadu News : పల్నాడు జిల్లాలో సిట్ కేసులలో శనివారం ఒక్కరోజే 13 మందిని అరెస్టు చేసినట్లు వివరాలు అధికారులు వెల్లడించారు. జిల్లా ఎస్పీ మలికా గర్గ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలో శనివారం ఎన్నికల కేసులకు సంబంధించిన పురోగతి వివరించారు. పోలింగ్ తేదీన, పోలింగ్ తేదీకి ముందు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల కేసులకు సంబంధించి ఒక్కరోజే 54 మందిని అరెస్టు చేశారు. ఎన్నికల నేరాలలో ఈ ఒక్కరోజే 9 మందికి 41 సీఆర్పీసీ నోటీస్ ఇచ్చారు. నరసరావుపేట సబ్ డివిజన్‌లో 01, సత్తెనపల్లి సబ్ డివిజన్‌లో 46, గురజాల సబ్ డివిజన్‌లో 27 మందిని బైండోవర్ చేశారు. మొత్తం 74 మందిని బైండోవర్ చేశారు. నరసరావుపేట సబ్ డివిజన్‌లో శనివారం 5 మందిపై రౌడీషీట్స్ ఓపెన్ చేసినట్లు పోలీసులు తెలిపారు.ఎన్నికల సమయంలో ట్రబుల్ మంగర్స్ గా గుర్తించి బైండోవర్ చేయగా ఆ బైండోవర్ ను ఉల్లంఘించిన 5 మందికి మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయటానికి నోటీసులు ఇచ్చారు.
పల్నాడులో చెలరేగిన హింస
అదేవిధంగా 102 సీఆర్పీసీ కేసు నమోదు చేసి, ఒక వాహనాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు తెసిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజల శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలియజేశారు. మే 13న పోలింగ్ రోజున మాచర్ల, గురజాల, నరసారావుపేట నియోజకవర్గాల్లో హింస చెలరేగింది. వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. వాహనాలను తగులబెట్టారు. ఇళ్ల మీద దాడులు చేశారు. భౌతిక దాడుల్లో కొందరికి గాయాలయ్యాయి. పోలింగ్ ముగిసిన మరుసటి రోజు మే 14న కూడా హింస కొనసాగింది. మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడి మండల కేంద్రంలో ఇళ్లపై దాడులతోపాటు వ్యాపార సంస్థలు, పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేశారు.
జూన్ 5 వరకు144 సెక్షన్
పల్నాడులో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంచేందుకు జూన్ 5 వరకు 144 సెక్షన్ కొనసాగుతుందని ఎస్పీ మలికా గార్గ్ తెలిపారు. అదనపు బలగాల పహారా ఉంటుందన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రభుత్వం ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదిక కూడా ఇచ్చింది. పల్నాడు, తాడిపత్రి, మాచర్ల, నరసరావుపేట, తిరుపతి, చంద్రగిరిలో హింసాత్మక ఘటనలు, అక్కడ నమోదైన ఎఫ్ఐఆర్‌లను సిట్ పరిశీలించి 22 కేసుల్లో 581 మందిని నిందితులుగా సిట్ రిపోర్టులో పేర్కొన్నారు. కొందరు పోలీసు అధికారుల పాత్రను కూడా సిట్ తప్పుబట్టింది.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం
టాపిక్