ప్రస్తుతం కన్నడతో పాటు ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చూపెడుతున్న మూవీ ‘కాంతారా’. ఈ సినిమాను రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. అత్యంత తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ఏకంగా 400 కోట్ల క్లబ్‌లో చేరింది.
అయితే బాక్సాఫీసు దగ్గర భారీ వసూళ్లు రాబట్టిన సినిమా ‘కాంతార’. ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్2’ నిర్మాతలు విజయ్ కిరగందూర్, చాలువే గౌడలు..హోంబలే ఫిల్మ్స్ పతాకంపై దీన్ని నిర్మించారు. సోమవారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ‘కాంతార’కి సీక్వెన్స్ నిర్మించే ఆలోచన ఉందని స్పష్టం చేశారు.
”కాంతార 2’పై తమకు స్పష్టమైన ప్రణాళిక ఉంది. కాకపోతే ఇప్పుడు ఇతర ప్రాజెక్టులతో తీరిక లేకుండా ఉన్నామని ఆయన తెలిపారు. రిషబ్ శెట్టి సైతం ఒక నెల విరామం తీసుకుంటానన్నారు. ఆయన తిరిగొచ్చాక ఫ్రాంఛైజీ చిత్రం అడుగులు పడతాయి. త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తాం’ అంటూ పేర్కొన్నారు.
కాంతారా2 లో కూడా ఆచారాలు, నమ్మకాలు అనే బేస్ లోనే కాంతారా 1 కంటే ఎక్కువ మెప్పించగల బలమైన కథతో మళ్లీ ముందుకు వస్తామని ఆయన అంటున్నారు. రిషబ్ శెట్టి ఈ మూవీ తీసే సమయంలో ఎలాంటి ప్లానింగ్స్ లేవని, అనుకోకుండానే ఆ కథను ఎంచుకొని సరికొత్తగా రూపొందించారని చెప్పుకొచ్చారు.
కాంతారా2లో శివ తండ్రి భూతకోల నర్తకిగా మారే ఆధ్యాత్మిక పాత్రపై దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ కథ ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రేక్షకులకు కనెక్ట్ అయిందని , కాంతారా 2 కూడా అదే లెవెల్లో రాబోతున్నట్టు వెల్లడించారు విజయ్ కిరగందూర్.