Best Web Hosting Provider In India 2024
అమరావతి: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి నిర్దేశించిన సబ్‌ప్లాన్ (ఉప ప్రణాళిక)ను ప్రభుత్వం మరో పదేళ్లు పొడిగించింది. ఈ మేరకు ఆదివారం ఆర్డినెన్స్‌ను జారీచేసింది. దళిత, గిరిజన సంక్షేమం, అభివృద్ధి కోసం పదేళ్ల కాలపరిమితితో ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం ఈ నెల 23తో ముగియనుంది. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ సబ్‌ప్లాన్‌ను కొనసాగించేందుకు సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఆయా వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.