Best Web Hosting Provider In India 2024
వైద్యం కోసం పేదలు అప్పులపాలు కాకూడదు, వైద్యం అందక పేదలు ప్రాణాలు పోకూడదనేది సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నిశ్చలమైన సంకల్పం. ఆ సంకల్పం నేడు ఫలించి పదిహేనేళ్ల బాలుడికి పునర్జనను ప్రసాదించింది. తన సుదీర్ఘ పాదయాత్రలో ఎంతోమంది పేదలు అనారోగ్యంతో వైద్యం కోసం పడిన కష్టాలను కళ్లారా చూసిన వైయస్ జగన్.. ముఖ్యమంత్రి కాగానే వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. ఆ సంస్కరణల్లో భాగంగానే తిరుపతిలో సీఎం వైయస్ జగన్ ఆదేశాల మేరకు నాడు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.ఎస్.జవహర్‌రెడ్డి తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో శ్రీపద్మావతి చిన్న పిల్లల కార్డియాక్ సెంటర్‌ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేయించారు. 2021 అక్టోబర్ 11న సీఎం వైయస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభింపజేసి.. వైద్య సేవలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.