Best Web Hosting Provider In India 2024
తాడేపల్లి: నేల స్వభావం రీత్యా రోడ్లు త్వరగా పాడైపోతున్నాయని, భారీ వాహనాలు తిరిగే సరికి కుంగిపోతుండటంతో పుల్ డెప్త్ రిక్లమేషన్ (ఎఫ్‌డీఆర్) టెక్నాలజీని వినియోగించి రోడ్లు నిర్మించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఎఫ్‌డీఆర్ ప్రతిపాదనకు సీఎం వైయస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న రోడ్లను పూర్తిగా బాగు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. దురుద్దేశంతో కొన్ని మీడియా సంస్థలు నెగెటివ్ ప్రచారం చేస్తున్నాయి. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా విష ప్రచారం చేస్తున్నాయని, వారి కడుపుమంటకు మందులేదన్నారు. రోడ్లు బాగు చేసిన తర్వాత నాడు – నేడు ద్వారా ప్రజల ముందు పెట్టాలి. అన్ని ప్రభుత్వ శాఖలో నాడు– నేడు శీర్షిక కింద మనం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచాలని అధికారులకు సూచించారు. సోమవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, పురపాలక, గిరిజన సంక్షేమశాఖల అధికారులతో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.