Best Web Hosting Provider In India 2024
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజారంజక పాలనపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుండగా, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రశంసిస్తున్నారు. తాజాగా సీపీఎం కురువృద్ధుడు, కృష్ణా జిల్లా నిడుమోలు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పాటూరు రామయ్య ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనను ప్రశంసించారు. పాటూరు రామయ్య శుక్రవారం మర్యాదపూర్వకంగా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్‌తో భేటీ అయ్యారు. పేదల శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన రామయ్య నిస్వార్థపరుడు, నిరాడంబరుడు, రైతు బాంధవుడు, భూపోరాట యోధుడుగా పేరు పొందారు.