Best Web Hosting Provider In India 2024
Prasanna Vadanam OTT streaming: సుహాస్ హీరోగా నటించిన ప్రసన్నవదనం సినిమా ఓటీటీలో దుమ్మురేపుతోంది. ఫేస్ బ్లైండ్‍నెస్ అనే విభిన్నమైన కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో మోస్తరు హిట్ కొట్టగా.. ఓటీటీ రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకుంటోంది. అర్జున్ వైకే ఈ మూవీకి దర్శకత్వం వహించారు. థియేటర్లలో మే 3వ తేదీన ఈ ప్రసన్నవదనం మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. నెల ముగియకముందే మే 24న ఆహా ఓటీటీలోకి ఈ సినిమా అడుగుపెట్టింది. కాగా, ఓటీటీలో ఈ సినిమా దూసుకెళుతోంది.
రికార్డు మైల్‍స్టోన్ క్రాస్
ప్రసన్నవదనం చిత్రం ఆహా ఓటీటీలో రికార్డుస్థాయి వ్యూస్ సాధిస్తోంది. తాజాగా ఈ సినిమా 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాల మైల్‍స్టోన్ దాటింది. ఈ విషయాన్ని ఆహా నేడు అధికారికంగా వెల్లడించింది.
రికార్డ్ బ్రేకింగ్ థిల్లర్ అంటూ ఆహా నేడు ట్వీట్ చేసింది. 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను దాటేసిందని పోస్టర్ షేర్ చేసింది. ఓటీటీలోకి వచ్చిన తొమ్మిది రోజుల్లోనే ఈ మార్క్ క్రాస్ చేసింది ప్రసన్నవదనం. మూడు రోజుల్లోనే 50 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలు దాటి.. ఆహాలో అత్యంత వేగంగా ఈ మార్క్ దాటిన చిత్రంగా నిలిచింది. అదే జోరును కొనసాగించి 100 మిలియన్ నిమిషాల మార్క్ కూడా అధిగమించింది.
ప్రసన్నవదనం చిత్రంలో యాక్టింగ్‍తో సుహాస్ మరోసారి మెప్పించారు. ముఖాలు గుర్చించలేని ఫేస్ బ్లైండ్‍నెస్ సమస్య ఉన్న యువకుడిగా నటన అదరగొట్టాడు. ఈ మూవీలో పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్, వైవా హర్ష, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత కీరోల్స్ చేశారు.
ప్రసన్నవదనం మూవీని దర్శకుడు అర్జున్ వైకే తెరకెక్కించారు. ఈ థిల్లర్ మూవీలో అతడి టేకింగ్, కాన్సెప్ట్ ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని లిటిల్ థాట్స్ సినిమాస్ పతాకంపై మణికంఠ, ప్రసాద్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించగా.. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు.
ప్రసన్నవదనం చిత్రం థియేటర్లలోనూ మంచి వసూళ్లు దక్కించుకుంది. మే 3న ఈ మూవీ విడుదలైంది. ఫుల్ రన్‍లో సుమారు రూ.5కోట్ల కలెక్షన్లు దక్కించుకుంది. తక్కువ బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దాదాపు అంచనాలను అందుకుంది. ఇప్పుడు ఆహా ఓటీటీలో దుమ్మురేపుతోంది.
శ్రీరంగనీతులు రెండు ఓటీటీల్లో..
సుహాస్ హీరోగా నటించిన శ్రీరంగనీతులు సినిమా సందిగ్ధత తర్వాత రెండు ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఆహా, అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అడుగుపెట్టింది. ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టింది. ప్లాఫ్‍గా నిలిచింది. ఓ దశలో ఓటీటీ డీల్ జరగకపోవటంతో నేరుగా యూట్యూబ్‍లోనే ఈ చిత్రం అందుబాటులోకి వస్తుందనే వార్తలు వచ్చాయి. అయితే, ఆ తర్వాత ట్విస్ట్ ఇచ్చి ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి శ్రీరంగనీతులు చిత్రం వచ్చింది.
శ్రీరంగనీతులు మూవీని దర్శకుడు వీఎస్ఎస్ ప్రవీణ్ తెరకెక్కించారు. అంథాలజీ మూవీగా తీసుకొచ్చారు. ఈ సినిమాలో సుహాస్, విరాజ్ అశ్విన్, కార్తిక్ రత్నం, రుహానీ శర్మ ప్రధాన పాత్రలు చేశారు. అజయ్ అరసాద, హర్షవర్దన్ రామేశ్వర్ ఈ మూవీకి సంగీతం అందించారు.