Sunday Motivation: విజయం సాధించాలంటే కొన్ని విషయాలను కచ్చితంగా పాటించాలి, అవేంటో తెలుసుకోండి

Best Web Hosting Provider In India 2024

Sunday Motivation: సక్సెస్ అయిన వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా అడిడే మొదటి ప్రశ్న మీ విజయ రహస్యం ఏమిటి? అని. కచ్చితంగా విజయం సాధించేందుకు దగ్గర దారులు ఉంటాయి. ఆ దగ్గర దారులే రహస్యాలు. దగ్గర దారులు అనగానే అడ్డదారుల్లో వెళ్లిపోవడం అనుకోకండి. విజయానికి దగ్గర దారి నిరంతరం కృషి చేయడం, కష్టపడడం. ఏం చేయాలనుకుంటున్నారో ఆ విషయంపై స్పష్టతను కలిగి ఉండడం. ఇవన్నీ మీకు ఉంటే విజయం సాధించడం చాలా సులువు.

విజయం సాధించే ముందు కొన్ని విషయాలను మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అందులో ముఖ్యమైనది మీరు చేయబోయే పని గురించి అందరికీ చెప్పకూడదు. అలా చెప్పడం వల్ల దానిపై అనేకమంది అనేక రకాల కామెంట్లు చేస్తారు. అవన్నీ మీపై చెడు ప్రభావాన్ని చూపించవచ్చు. మీరు ఏం సాధించాలనుకుంటున్నారో, ఎలా సాధించాలి అనుకుంటున్నారో వ్యూహాన్ని రహస్యంగానే ఉంచుకోవాలి.

విజయం సాధిస్తారా లేదా అనే సందేహం, భయం వస్తే వెంటనే ఆ భయాన్ని చంపేయడానికి ప్రయత్నించండి. కానీ విజయం సాధించగలరా లేదా అని అనుమానాన్ని మాత్రం పెంచుకోకండి. భయం, అనుమానం ఎప్పుడూ చోటు చేసుకుంటాయి. అక్కడ విజయం దూరమవుతుంది.

విజయం సాధించడానికి ఒక మనిషికి కావాల్సింది స్పష్టత. తనపై తనకు విశ్వాసం. కానీ ఏ విషయంలో ఏం సాధించాలనుకుంటున్నాడు అనే విషయంపై స్పష్టత ఉంటే… ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా తాను అనుకున్నది సాధించి తీరుతాడు. స్పష్టత లేనప్పుడు మీకు ఆత్మవిశ్వాసం అధికంగా ఉన్నా ఉపయోగం ఉండకపోవచ్చు.

విజయం సాధించాలనుకున్న వ్యక్తి స్వార్థంగా ఉండాలి. స్వార్థం అంటే ఎదుటి వ్యక్తిని బాధపెట్టేదిగా ఉండడం కాదు… విజయం సాధించి తీరాలన్న స్వార్థం ఉండాలి. చుట్టుపక్కల ఏమి జరుగుతున్నా వాటికి ప్రభావితం కాకూడదు. మీలో ఎప్పుడైతే విజయ స్వార్థం వస్తుందో అప్పుడు మీరు లక్ష్యం వైపుగా అడుగులు వేస్తారు. కానీ మీ స్వార్థం ఎప్పుడూ కూడా ఎదుటివారిని బాధ పెట్టకూడదు. అలా బాధపెట్టి సాధించే విజయం ఉపయోగం లేనిది.

ఒక వ్యక్తి గొప్పవాడు అవ్వాలంటే అది పుట్టుక ద్వారా కాదు, తాను చేసే పనుల ద్వారా అవుతాడు. విజయం సాధించాలనుకునే వ్యక్తి అడ్డదారులు తొక్కడం ద్వారా గొప్పవాడు కాలేడు. కేవలం సరైన పద్ధతిలో అనుకున్న లక్ష్యాన్ని చేరితేనే గొప్పవాడు అవుతాడు. ఆ ప్రయాణంలో మీరు ఎవరికీ హాని కలిగే పనులు చేయకూడదు. ఎవరి జీవితాన్ని ప్రభావితం చేయకూడదు. మంచి మార్గంలో నే సాగుతూ ముందుకు వెళ్లాలి.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024