Bad Newz OTT: ఓటీటీలో యానిమ‌ల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి బోల్డ్ మూవీకి ఫుల్ డిమాండ్ – షూటింగ్ పూర్తికాకుండానే డీల్ క్లోజ్‌

Best Web Hosting Provider In India 2024

Bad Newz OTT: యానిమ‌ల్‌తో ఓవ‌ర్‌నైట్‌లో స్టార్‌గా మారిపోయింది బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి. ర‌ణ‌భీర్‌క‌పూర్ హీరోగా సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మూవీలో ఓ బోల్డ్ రోల్‌లో న‌టించింది. యానిమ‌ల్‌లో ర‌ణ‌భీర్‌క‌పూర్‌తో త్రిప్తి డిమ్రి చేసిన ఇంటిమేట్ సీన్స్ హాట్ టాపిక్‌గా నిలిచాయి. ఈ ఇంటిమేట్ సీన్స్‌లో న్యూడ్‌గా క‌నిపించింది త్రిప్తి డిమ్రి.

సోష‌ల్ మీడియా సెన్సేష‌న్‌…

ఈ సినిమాలో త్రిప్తి డిమ్రి రోల్ లెంగ్త్‌ త‌క్కువే అయినా ఈ ఇంటిమేట్ సీన్స్‌లో అందాల ప్ర‌ద‌ర్శ‌న‌తో యువ‌త‌రం హృద‌యాల‌ను కొల్ల‌గొట్టింది. ఈ మూవీతో హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న కంటే ఎక్కువ‌గా త్రిప్తి డిమ్రి పాపుల‌ర్ అయ్యింది. యానిమ‌ల్ రిలీజ్ త‌ర్వాత సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్‌గా మారిపోయింది. త్రిప్తి డిమ్రి ఫాలోవ‌ర్ల సంఖ్య భారీగా పెరిగింది. యానిమ‌ల్ మూవీతో ఇండ‌స్ట్రీ దృష్టిని ఆక‌ర్షించింది త్రిప్తి డిమ్రి. ప‌లు భారీ బ‌డ్జెట్ సినిమాల్లో ఆమెకు ఆఫ‌ర్లు వ‌స్తోన్నాయి.

బ్యాడ్ న్యూస్ రిలీజ్ డేట్‌…

త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా న‌టిస్తోన్న బాలీవుడ్ మూవీ బ్యాడ్ న్యూస్‌ రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ అనౌన్స్‌చేశారు. ఈ సినిమా జూలై 19న థియేట‌ర్ల‌లోకి రాబోతోంది. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీలో విక్కీ కౌషల్, అమ్మీ విర్క్ హీరోలుగా న‌టిస్తోన్నారు. క‌ర‌ణ్ జోహార్ ప్రొడ్యూస్ చేస్తోన్నాడు. ఈ బోల్డ్ మూవీలో త్రిప్తి డిమ్రితో పాటు స‌న్యా మ‌ల్హోత్రా, ఫాతిమా స‌నా షేక్‌, నేహా ధూపియా కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. ఈ మూవీలో పెళ్లి కాకుండా త‌ల్ల‌యిన యువ‌తిగా త్రిప్తి డిమ్రి క‌నిపించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇద్ద‌రు యువ‌కుల‌తో ఓ యువ‌తి ఎలా ప్రేమ‌లో ప‌డింది? ఆ ఇద్ద‌రిలో ఆమె ఎవ‌రిని ప్రేమించింది? ఆమె ప్రెగ్నెంట్ కావ‌డానికి దారితీసిన ప‌రిస్థితుల‌ను ఫ‌న్నీగా ద‌ర్శ‌కుడు ఆనంద్ తివారీ ఈ మూవీలో చూపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. యానిమ‌ల్‌కు మించి ఈ మూవీలో త్రిప్తి డిమ్రి క్యారెక్ట‌ర్ బోల్డ్‌గా ఉంటుంద‌ని అంటున్నారు.

గుడ్ న్యూస్‌కు రీమేక్‌…

అక్ష‌య్ కుమార్, క‌రీనా క‌పూర్‌, కియారా అద్వానీ హీరోహీరోయిన్లుగా న‌టించిన గుడ్ న్యూస్ మూవీకి సీక్వెల్‌గా బ్యాడ్ న్యూస్ ప్రేక్ష‌క‌లు ముందుకు రాబోతోంది. కాగా బ్యాడ్ న్యూస్‌ షూటింగ్ పూర్తికాకుండా ఓటీటీ హ‌క్కులు అమ్ముడుపోయాయి. ఈ రొమాంటిక్ మూవీ ఓటీటీ హ‌క్కుల‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ భారీ ధ‌ర‌కు సొంతం చేసుకున్న‌ది. దాదాపు 25 కోట్ల‌కు ఈ మూవీ ఓటీటీ హ‌క్కులు అమ్ముడుపోయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఓటీటీ డీల్‌తోనే ప్రొడ్యూస‌ర్స్ లాభాల్లోకి అడుగుపెట్టిన‌ట్లు స‌మాచారం.

బాలీవుడ్‌లో బిజీ…

యానిమ‌ల్ స‌క్సెస్‌తో త్రిప్తి డిమ్తి బాలీవుడ్‌లో ఫుల్ బిజీగా మారిపోయింది. ప్ర‌స్తుతం ఏడుకుపైగా సినిమాలు చేస్తోంది. భూల్ బుల‌య్యా 3, ధ‌డ‌క్ 2, విక్కీ విద్యా కా వో వాలా వీడియోతో పాటు మ‌రో నాలుగు సినిమాల షూటింగ్‌లు జ‌రుగుతోన్నాయి. టాలీవుడ్ నుంచి త్రిప్తి డిమ్రికి ప‌లు ఆఫ‌ర్లు వ‌స్తోన్నాయి.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024