Mahabubnagar MLC Bypoll : ఓటమి తర్వాత బీఆర్ఎస్ కు తొలి విక్టరీ – మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానం కైవసం

Best Web Hosting Provider In India 2024

Mahabubnagar MLC Bypoll 2024: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ కుమార్ రెడ్డి సుమారు 108 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత… బీఆర్ఎస్ కు దక్కిన తొలి విజయం ఇదే..!

మహబూబ్‌నగర్‌లోని స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. నియోజకవర్గంలో 1,439 మంది ఓటర్లు నమోదు చేసుకోగా… 1,437 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారులు ఐదు టేబుళ్లలో లెక్కింపును నిర్వహించారు. నాలుగు టేబుళ్లలో ఒక్కొక్కటి 300 ఓట్లను నిర్వహించగా… ఐదవ టేబుల్‌లో మిగిలిన 237 ఓట్లు పోలయ్యాయి.

గతంలో ఈ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ తరపున కసిరెడ్డి నారాయణ గెలిచారు. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ లో చేరిన ఆయన… కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో తన ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేశారు. 

స్థానిక సంస్థ ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉండడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. మార్చి 28న పోలింగ్ జరిగినప్పటికీ సార్వత్రిక ఎన్నికల కారణంగా కౌంటింగ్‌లో జాప్యం ఏర్పడింది. జూన్ 2వ తేదీన ఫలితాలను ప్రకటించేందుకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తాజా విజయం బీఆర్ఎస్ పార్టీకి ఉపశమనం ఇచ్చిందని చెప్పొచ్చు. ఓవైపు అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలను సాధించి ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. మరోవైపు ఇటీవలే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం కనిపించటం లేదు. తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉపఎన్నికలో గెలిచి సిట్టింగ్ స్థానాన్ని నెలబెట్టుకోవటం రిలీఫ్ ఇచ్చే అంశమని చెప్పొచ్చు.

 

 

IPL_Entry_Point

టాపిక్

BrsTelangana NewsTrending TelanganaTelangana Mlc Elections
Source / Credits

Best Web Hosting Provider In India 2024