Stickers On Fruits : పండ్లపై స్టిక్కర్లు ఎందుకు పెడతారు? వీటి అర్థమేంటి?

Best Web Hosting Provider In India 2024

అందరం పండ్లు, కూరగాయలు కొంటాం. కొన్నిసార్లు పండ్లపై స్టిక్కర్లు కనిపిస్తాయి. దాదాపు అందరం.. తాజా, కాస్ట్లీ పండ్లు కాబట్టి.. ఇలా స్టిక్కర్లు ఉంటాయని అనుకుంటాం. పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మార్కెట్లో పండ్లు కొన్నప్పుడు స్టిక్కర్ల విషయాలు పెద్దగా పట్టించుకోము. కానీ వాటిలోనే అసలు విషయాలు ఉంటాయి. పండ్లు, కూరగాయలను కొనుగోలు చేసేటప్పుడు వాటిపై చిన్న స్టిక్కర్లను గమనిస్తాం. అయితే వీటి వెనక కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఈ విషయాలపై శ్రద్ధ పెడితే మన ఆరోగ్యాన్ని కొంతవరకైనా కాపాడుకోవచ్చు.

ఆహారంలో పండ్లను చేర్చుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే మనలో కొంతమంది మాత్రమే పండ్లు ఎంత తాజావి, అవి ఎక్కడ నుండి వచ్చాయో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. మీరు ఎప్పుడైనా దుకాణంలో కొనుగోలు చేసిన పండ్లపై ఆ చిన్న స్టిక్కర్లను చదవడానికి ప్రయత్నించారా? రిఫ్రిజిరేటర్ నుండి యాపిల్‌ను తీసి, అది ఎలాంటి స్టిక్కర్ అని గుర్తించడానికి ప్రయత్నించారు? ఈ స్టిక్కర్ల గురించి కొన్ని విషయాలు చూద్దాం..

స్థానిక పండ్ల మార్కెట్, కూరగాయల విక్రయదారుల నుండి కొనుగోలు చేసిన పండ్ల కంటే సూపర్ మార్కెట్ల నుండి కొనుగోలు చేసిన పండ్లపై స్టిక్కర్లను ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. స్టిక్కర్‌పై PLU కోడ్ ముద్రించబడి ఉంటుంది. ఈ కోడ్ సులభంగా బిల్లింగ్ కోసం బార్ కోడ్ మాత్రమే కాకుండా, పండు లేదా కూరగాయలను ఎలా పండించారు? అది ఎక్కడ నుండి వచ్చింది? అనే దాని గురించి ముఖ్యమైన సమాచారాన్ని కూడా అందిస్తుంది.

స్టిక్కర్‌ను జాగ్రత్తగా విశ్లేషించడం ద్వారా, మీరు ఎవరినీ అడగకుండానే పండు స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చు. జన్యుమార్పిడి చేసినా, సేంద్రియ పద్ధతిలో, సంప్రదాయ పద్ధతిలో పండించినా, శిలీంధ్రాలు, క్రిమిసంహారక మందులతో పండించినదా.. ఇలా అన్ని విషయాలను మనం ఆ స్టిక్కర్‌ను చూసి అర్థం చేసుకోవచ్చు. వీటన్నింటిపై శ్రద్ధ పెడితే కొంత వరకు అనేక సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి.

ఈ సంఖ్య ఉంటే

వీటిలో మొదటిది నాలుగు అంకెల సంఖ్య స్టిక్కర్లు. పండులో 4080 వంటి నాలుగు అంకెల సంఖ్య ఉంటే, అది పండు సాధారణంగా పెరిగినట్లు సూచిస్తుంది. పురుగుమందులు తక్కువగా వాడబడినప్పటికీ, సాంప్రదాయకంగా ఉత్పత్తులను ఉపయోగించి దీనిని పెంచుతారు. దాదాపు అన్ని అరటిపండ్ల స్టిక్కర్‌పై కోడ్‌గా 4011ని కలిగి ఉంటాయి.

8తో ప్రారంభమయ్యే స్టిక్కర్

మీరు ఎంచుకునే పండు 8తో ప్రారంభమయ్యే ఐదు అంకెల సంఖ్యను కలిగి ఉంటే, అది జన్యు మార్పుతో పెరిగినట్లు సూచిస్తుంది. ఇది తరచుగా మీకు కొన్ని సమస్యలను కలిగిస్తుంది. ఎందుకంటే జన్యుమార్పిడితో పెరిగిన ఉత్పత్తి ఆరోగ్యానికి హానికరం, ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పండు పెరిగేందుకు వివిధ రసాయనాలను కూడా వాడుతారు.

9తో ప్రారంభమయ్యే స్టిక్కర్

స్టిక్కర్‌లో 9తో ప్రారంభమయ్యే ఐదు అంకెల సంఖ్య ఉంటే సేంద్రీయ పద్ధతిలో పండిందని, వినియోగానికి మంచిదని అర్థం. ఉదాహరణకు సేంద్రీయ ఎరువులతో పండించిన అరటి సంఖ్య 94001తో ప్రారంభమైతే, మీరు ఈ పండును నిర్భయంగా ఉపయోగించవచ్చని చూపిస్తుంది. సందేహం అవసరం లేదన్నది నిజం.

స్టిక్కర్లు ఎప్పుడు మెుదలయ్యాయి?

ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ ప్రొడ్యూస్ స్టాండర్డ్స్ (IFPS) ద్వారా ప్రపంచవ్యాప్తంగా స్టిక్కర్‌లు జారీ చేయబడ్డాయి. ఈ స్టిక్కర్లను చూస్తే ఆహారం, పానీయాల కోసం కొనుగోలు చేసే పండ్ల గురించి కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. పండ్ల స్టిక్కర్లు సాధారణంగా స్థానిక విక్రేతల కంటే సూపర్ మార్కెట్ల నుండి కొనుగోలు చేసిన పండ్లపై ఎక్కువగా కనిపిస్తాయి. స్టిక్కర్‌పై PLU కోడ్ ముద్రించి ఉంటుంది.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024