OTT: అనుకున్నట్టే ఓటీటీలో అదరగొడుతున్న పాపులర్ వెబ్ సిరీస్.. టాప్‍లో ట్రెండింగ్.. రెండో ప్లేస్‍లో తెలుగు మూవీ

Best Web Hosting Provider In India 2024

Amazon Prime Video OTT: పంచాయత్ వెబ్ సిరీస్‍‍లో తొలి రెండు సీజన్లు చాలా సక్సెస్ అయ్యాయి. ఈ సిరీస్‍కు అదిరిపోయే క్రేజ్ వచ్చింది. అయితే, రెండేళ్ల నిరీక్షణ తర్వాత ఇటీవలే పంచాయత్ మూడో సీజన్ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఈ సీజన్‍కు కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావటంతో భారీ వ్యూస్ సాధిస్తూ దూసుకుపోతోంది. అంచాలను నిలబెట్టుకుంటూ అనుకున్నట్టే పంచాయత్ సీజన్ 3 కూడా సక్సెస్ అయింది. ఇంకా ఈ మూడో సీజన్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో టాప్‍లో ట్రెండ్ అవుతోంది. ఆ వివరాలు ఇవే..

టాప్‍లో ట్రెండింగ్

పంచాయత్ మూడో సీజన్ మే 28వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. రెండేళ్ల నుంచి ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తుండగా ఎట్టకేలకు అడుగుపెట్టింది. ఈ సీజన్ కూడా ఆకట్టుకోవడంతో దుమ్మురేపుతోంది.

అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా ట్రెండింగ్‍లో ప్రస్తుతం (జూన్ 2) పంచాయత్ సీజన్ 3 ప్రస్తుతం టాప్‍లో ఉంది. స్ట్రీమింగ్‍‍కు అడుగుపెట్టి ఆరు రోజులు కాగా.. ఇంకా టాప్‍లోనే సత్తాచాటుతోంది. అంతటా పాజిటివ్ రెస్పాన్స్ ఉండటంతో మరికొంత కాలం ఈ సిరీస్ దుమ్మురేపే ఛాన్స్ ఉంది. పంచాయత్ మూడో సీజన్ హిందీలో స్ట్రీమింగ్‍కు రాగా.. ఇంగ్లిష్ సబ్‍టైటిల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

పంచాయత్ వెబ్ సిరీస్‍లో జితేంద్ర కుమార్, రఘువీర్ యాదవ్, నీనా గుప్తా, ఫైజల్ మాలిక్, చందన్ రాయ్, దుర్గేశ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూడో సీజన్‍.. ఫులేరా గ్రామ రాజకీయాల చుట్టూ తిరుగుతుంది. కామెడీ, ఎమోషన్ సీన్లతో పాటు పాలిటిక్స్ కూడా ఈ సీజన్‍లో ప్రధానంగా ఉన్నాయి.

పంచాయత్ వెబ్ సిరీస్ మూడో సీజన్‍కు దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహించారు. చందన్ కుమార్ కథ అందించారు. ది వైరల్ ఫీవర్ బ్యానర్ నిర్మించిన ఈ సిరీస్‍కు అనురాగ్ సైకియా సంగీతం అందించారు.

రెండో ప్లేస్‍లో అల్లరి నరేశ్ మూవీ.. టాప్-10 ఇవే

అల్లరి నరేశ్ హీరోగా నటించిన కామెడీ డ్రామా మూవీ ఆ ఒక్కటి అడక్కు చిత్రం మే 31వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. మే 3న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం నెల తిరగకుండానే ప్రైమ్ వీడియోలో అడుగుపెట్టింది. ఈ మూవీకి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం (జూన్ 2) ప్రైమ్ వీడియోలో ఈ మూవీ టాప్-2లో ట్రెండ్ అవుతోంది.

కల్కి 2898 ఏడీ చిత్రానికి ప్రిల్యూడ్‍‍గా వచ్చిన బుజ్జిభైరవ యానిమేటెడ్ సిరీస్ కూడా ప్రైమ్ వీడియోలో సత్తాచాటుతోంది. ఈ సిరీస్‍లో కేవలం రెండు ఎపిసోడ్లే వచ్చినా.. ట్రెండింగ్‍‍లో టాప్-4లో ప్రస్తుతం ఉంది.

ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం (జూన్ 2) టాప్‍-10లో ఉన్నవి ఇవే

  1. పంచాయత్ సీజన్ 3 – హిందీ వెబ్ సిరీస్
  2. ఆ ఒక్కటి అడక్కు – తెలుగు సినిమా
  3. మాడ్గావ్ ఎక్స్‌ప్రెస్ – హింది సినిమా
  4. బుజ్జిభైరవ – యానిమేషన్ వెబ్ సిరీస్
  5. ఆవేశం – మలయాళం సినిమా
  6. రత్నం – తమిళ మూవీ (తెలుగులోనూ స్ట్రీమింగ్)
  7. యోధ – హిందీ సినిమా
  8. డై హార్ట్ 2 – ఇంగ్లిష్ సినిమా
  9. తేరే బాతో మే ఐసా ఉల్జా జియో – హిందీ సినిమా
  10. ఫ్యామిలీ స్టార్ – తెలుగు సినిమా
IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024