Best Web Hosting Provider In India 2024
Aranmanai 4 OTT: తమిళ సీనియర్ నటుడు సి.సుందర్, స్టార్ హీరోయిన్లు తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన పాత్రలు పోషించిన ‘అరణ్మనై 4’ చిత్రం ఈ ఏడాది మే 3వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. తెలుగులో ఈ చిత్రం ‘బాక్’ పేరుతో వచ్చింది. ఈ కామెడీ హారర్ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చిన వసూళ్లతో దుమ్మురేపింది. అరణ్మనై 4 మూవీకి తమిళంలో బంపర్ కలెక్షన్లు దక్కాయి. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఖరారైంది.
అప్‍డేట్ ఇదే
అరణ్మనై 4 (తెలుగులో బాక్) సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. ఈ విషయంపై ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమాను త్వరలోనే స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు హాట్‍స్టార్ ఓటీటీ నేడు (జూన్ 2) అప్‍డేట్ ఇచ్చింది. అయితే, స్ట్రీమింగ్ డేట్‍ను వెల్లడించలేదు. కమింగ్ సూన్ అంటూ పోస్టర్ తీసుకొచ్చింది హాట్‍స్టార్.
నాలుగు భాషల్లో..
అరణ్మనై 4 చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు హాట్‍స్టార్ వెల్లడించింది. మరో వారం రోజుల్లోనే ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశం ఉంది. స్ట్రీమింగ్ డేట్‍ను త్వరలోనే హాట్‍స్టార్ వెల్లడించనుంది.
ప్రధాన పాత్ర పోషించిన సుందర్ సీ.. అరణ్మనై 4 చిత్రానికి దర్శకత్వం వహించారు. తమిళ సూపర్ హిట్ ఫ్రాంచైజీ అరణ్మనైలో నాలుగో చిత్రంగా ఇది వచ్చింది. తెలుగులో బాక్ పేరుతో వచ్చి మోస్తరు వసూళ్లను దక్కించుకుంది. తమన్నా భాటియా, రాశీ ఖన్నా ఉండటంతో ఈ మూవీకి ఫుల్ క్రేజ్ వచ్చింది.
అరణ్మనై 4లో రామచంద్ర రాజు, సంతోష్ ప్రతాప్, కోవై సరళ, యోగిబాబు, వీటీవీ గణేశ్, ఢిల్లీ గణేశ్, జయప్రకాశ్, ఫ్రెడ్రిక్ జాన్సన్ కీలకపాత్రలు పోషించారు. అన్వి సినీమ్యాక్స్, బెంజ్ మీడియా బ్యానర్లపై ఖుష్బూ సుందర్, అరుణ్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి హిప్‍హాప్ తమిళ సంగీతం అందించారు.
అరణ్మనై 4 కలెక్షన్లు
అరణ్మనై 4 చిత్రం మే 3వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. మొదట్లో ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే, కలెక్షన్లలో మాత్రం దుమ్మురేపింది. రూ.100కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి అదరగొట్టింది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బస్టర్ అయింది.
అరణ్మనై 4 స్టోరీ లైన్
శివశంకర్ (సుందర్) ఓ న్యాయవాదిగా ఉంటారు. అతడి సోదరి శివానీ (తమన్నా) హఠాత్తుగా ఓ రోజు ఆత్మహత్యకు పాల్పడుతుంది. శివానీ భర్త కూడా చనిపోతాడు. అయితే, తన సోదరి ఆత్మహత్య చేసుకోలేదని శివశంకర్ బలంగా నమ్ముతాడు. మిస్టరీని ఛేదించేందుకు నిర్ణయించుకుంటాడు. అసలు శివానీ విషయంలో ఏం జరిగింది? ఆమెది ఆత్మహత్యనా హత్యానా? ఈ మరణాల వెనుక మిస్టరీ ఏంటి అనేదే ఈ అరణ్మనై 4 (బాక్) మూవీలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి.
అరణ్మనై 4 మూవీ కథ కొత్తగా లేదని, కామెడీ కూడా చాలాచోట్ల వర్కౌట్ కాలేదనే అభిప్రాయాలు మొదట్లో వ్యక్తమయ్యాయి. అయితే, నెగెటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ చిత్రం జోరు చూపించింది. మిక్స్డ్ టాక్‍ను దాటి సూపర్ హిట్ అయింది.