ఏపీలో మళ్లీ వైయ‌స్ఆర్‌సీపీదే అధికారం

Best Web Hosting Provider In India 2024

 

ఎంపీ విజయసాయిరెడ్డి

నెల్లూరు:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మ‌ళ్లీ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అధికార‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు. నెల్లూరు నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో కౌంటింగ్ ఏజెంట్లతో  ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. మళ్లీ వైయ‌స్ఆర్‌సీపీదే అధికారం, నెల్లూరు పార్లమెంటుతో పాటు ఏడు అసెంబ్లీ స్ధానాలు గెలుస్తున్నామ‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు. కౌంటింగ్ మొదలైనప్పటి నుండి చివరి వరకు  ప్రతీది ఏజెంట్లు  క్షుణ్ణంగా పరిశీలించాల‌న్నారు. పేదలు, బడుగు బలహిన వర్గాలు, మహిళలు, గ్రామీణ ప్రాంత ప్రజలు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లశారు..జిల్లాలో కీలక నియోజకవర్గాలుగా ఉన్న నెల్లూరు సిటీ కోవూరులో కూడా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో గెలవబోతోంద‌ని విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు.

Best Web Hosting Provider In India 2024