Best Web Hosting Provider In India 2024
Ganja Attack: గంజాయి మత్తు జగిత్యాల జిల్లాలో ఘర్షణకు దారితీసింది. మత్తులో ఊగిపోతు ఐదుగురు ఓ యువకుడిపై దాడి చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మెట్ పల్లి మండలం కోండ్రపేటలో గంజాయి మత్తులో ఐదుగురు అదే గ్రామానికి చెందిన మూదం రమేష్ పై దాడి చేశారు.
పదునైన ఆయుదంతో తలపై బాదడంతో రెండు ఇంచుల పొడవు బారీ గాయమయ్యింది. వెంటనే స్థానికులు గాయపడ్డ రమేష్ ను మెట్ పల్లి ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ప్రస్తుతం రమేష్ ఆసుపత్రిలో కోలుకుంటుండగా దాడి చేసిన ఐదుగురిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
గంజాయితో బతుకులు ఆగం
గంజాయి మత్తుకు అలువాటుపడి ముక్కుపచ్చలారని మైనర్లు తమ జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. గంజాయికి అలవాటుపడి చదువుకు దూరమై విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు. నెలరోజుల క్రితం జగిత్యాలలో ఓ మైనర్ అమ్మాయిని సైతం ట్రాప్ చేసి మోసం చేసిన ఘటనతో అప్పట్లో పోలీసులు మెరుపుదాడులు నిర్వహించి గంజాయి విక్రయించినా, వినియోగించిన వారిపై ఉక్కుపాదం మోపారు.
గంజాయిపై పోలీసుల నిఘా పెట్టిన మత్తుకు అలవాటుపడ్డ యువత రహస్యంగా గంజాయి వినియోగిస్తు విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు. గంజాయిని సమూలంగా నిర్మూలించేలా పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని జనం కోరుతున్నారు.
కరీంనగర్ లో భారీగా గంజాయి పట్టివేత
ఒడిస్సా నుంచి కరీంనగర్ మీదుగా మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని కరీంనగర్ పోలీసులు పట్టుకున్నారు. కరీంనగర్ తీగల వంతెన వద్ద వాహనాల తనికీ చేపట్టిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి 70 కేజీల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. గంజాయితోపాటు స్విఫ్ట్ డిజైర్ కారును సీజ్ చేశారు.
విశాఖపట్నం జిల్లా కొమ్మాది చెందిన సెరకనం రామకృష్ణ, కాకినాడ జిల్లా కిర్లంపూడి కి చెందిన దొడ్డి మణికంఠ, మహారాష్ట్ర లోని పబ్బని జిల్లా బీమ్ నగర్ కు చెందిన ధర్మేంద్రకుమార్ అలియాస్ సల్మాన్ అన్సారీ ముగ్గురు కలిసి ఒడిస్సాలో గంజాయిని తక్కువ దరకు కొనుగోలు చేసి కరీంనగర్ మీదుగా మహారాష్ట్ర కు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు.
రెండు కిలోల చొప్పున గంజాయి 35 ప్యాకెట్లు తయారు చేసి కారు వెనుక సీటులో అమర్చారు. ఎవరికి అనుమానం రాకుండా తరలిస్తు కరీంనగర్ పోలీసులకు చిక్కారు. కారు మధ్యప్రదేశ్ కి చెందినదిగా నెంబర్ ప్లేట్ ఉండగా, ఏపీ కి సంబంధించినట్లు గుర్తించారు.
కారుకు ఎంపి 66 జీ 0897 నెంబర్ ఉండగా కారు మాత్రం ఏపి 31 బిహెచ్ 2925 నెంబర్ తో రిజిస్టర్ అయి ఉంది. అందుకు సంబంధించిన నెంబర్ ప్లేట్ కారులో లభించింది. ముగ్గురిపై ఎన్టీపిఎస్ యాక్ట్ 1985 ప్రకారం 8(సి)r/w 20(B)(ii)(C) సెక్షన్ ల క్రింద కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ టౌన్ ఏసిపి నరేందర్ తెలిపారు.
(రిపోర్టింగ్ కేవీరెడ్డి, HT తెలుగు, ఉమ్మడి కరీంనగర్)
సంబంధిత కథనం
టాపిక్