Cancer Screening: ఏపీలో గ్రామ స్థాయిలోనే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, 30ఏళ్ల పైబడిన వారికి వైద్య పరీక్షలు

Best Web Hosting Provider In India 2024

Cancer Screening: క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఏపీలోగ్రామ స్థాయిలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు పూర్తి చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. విశాఖపట్నంలోని హోమిబాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి అపెక్స్ సెంటర్‌గా, ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంకేతిక భాగస్వామిగా, 30 ఏళ్లు పైబడిన వారి కోసం సమగ్ర క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాంకు (CCSP) వైద్య ఆరోగ్య శాఖ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది.

ఈ కార్యక్రమంలో భాగంగా మూడు సాధారణ రకాల రొమ్ము, దంత మరియు గర్భాశయ క్యాన్సర్‌లను పరీక్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను వివిధ స్థాయిలలో సమన్వయం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.

స్క్రీనింగ్ ప్రక్రియ

◦విలేజ్ హెల్త్ క్లినిక్ (VHC) స్థాయిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు (సిహెచ్ఓలు) మరియు ఆక్సిలరీ నర్స్ మిడ్‌వైవ్‌లు (ఎఎన్ఎంలు) మెడికల్ ఆఫీసర్‌లతో స్క్రీనింగ్‌లు నిర్వహిస్తారు.

◦ అసాధారణ ఫలితాలు వెల్లడయిన వ్యక్తులను తదుపరి రోగ నిర్ధారణ మరియు నిర్వహణ కోసం ప్రతి జిల్లాలో ప్రతిపాదించబడిన వైద్య కళాశాలలకు పంపుతారు.

వైద్య కళాశాలల పాత్ర

◦ వైద్య కళాశాలలు గైనకాలజీ, జనరల్ సర్జరీ, ఇఎన్ టి, డెంటల్ సర్జరీ, పాథాలజీ, రేడియాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ మరియు కమ్యూనిటీ మెడిసిన్‌లలో నిపుణులను కలిగి ఉన్న ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్లను ఏర్పాటు చేశాయి. కమ్యూనిటీ మెడిసిన్‌లో నిపుణుడు ప్రతి వైద్య కళాశాలలో ఈ ప్రోగ్రాంను పర్యవేక్షించే నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు.

◦ సిఫార్సు చేయబడిన వ్యక్తులందరికీ క్యాన్సర్‌ పరీక్షలను నిర్వహిస్తారు. అంతేకాక వైద్య కళాశాలలో చికిత్సను అందిస్తారు.

◦ ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్లు (మెడికల్ కాలేజీలలో) క్వాలిటీ కంట్రోల్ టీంలుగా వ్యవహరిస్తాయి. ఈ టీం లు సెకండరీ కేర్ లెవెల్‌లో శిక్షణను పర్యవేక్షించడంతోపాటు క్షేత్రస్థాయిలో స్క్రీనింగ్ నాణ్యతను కూడా పరిశీలిస్తాయి.

శిక్షణ మరియు సామర్థ్యం పెంపు

◦ క్యాన్సర్ పరీక్షల్ని సమర్థవంతంగా నిర్ధారించడానికి బహుళ-దశల శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

◦ హోమిబాబా క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అపెక్స్ సెంటర్‌గా వ్యవహరిస్తుంది. మెడికల్ కాలేజీలలో ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్‌ల సెన్సిటైజేషన్ ట్రైనింగ్ బాధ్యతను కూడా నిర్వహిస్తోంది.

◦ సెకండరీ కేర్ హాస్పిటల్స్ (ఏరియా హాస్పిటల్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్) నుండి డెంటల్ అసిస్టెంట్ సర్జన్స్ మరియు గైనకాలజిస్ట్స్ వంటి స్పెషలిస్ట్‌లకు వారి సంబంధిత మెడికల్ కాలేజీలలో మలిదశ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

◦ ఈ కేంద్రాలలో మెడికల్ ఆఫీసర్లు, సిహెచ్ఓలు మరియు ఎఎన్ఎంల కోసం మూడవ దశ శిక్షణా కార్యక్రమాలను నిర్ణీత కేంద్రాల వద్ద నిర్వహించటం, కార్యక్రమాలపై అవగాహన కల్పించడం, కౌన్సెలింగ్ అందించడం, స్క్రీనింగ్‌లు నిర్వహించడం మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యకలాపాల కోసం పటిష్టమైన రిఫరల్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడంపై శిక్షణ అందిస్తారు.

◦ ఆంధ్రప్రదేశ్ అంతటా క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడంతో పాటు బాధితులకు తగిన వైద్యాన్ని అందించటం, వైద్య కళాశాలలు మరియు సెకండరీ కేర్ ఆసుపత్రుల నైపుణ్యాన్ని పెంచడం వంటి అంశాలను ఈ కార్యక్రమం అమలుకు లక్ష్యాలుగా వైద్య ఆరోగ్య శాఖ నిర్దేశించుకుంది. దీనితో పాటు ఈ క్లిష్టమైన ప్రజారోగ్య పరిరక్షణా ప్రయత్నానికి ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ ప్రదాతలను సన్నద్ధం చేయాలని నిర్ణయించుకుంది.

గ్రామ స్థాయిలో క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం క్షేత్ర స్థాయికి చేరుకోవడానికి శిక్షణ మాడ్యూల్ మొత్తాన్ని కమీషనర్ పర్యవేక్షిస్తున్నారు. హోమిబాబా హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ని ఇటీవల కమీషనర్ సందర్శించి శిక్షణ కార్యక్రమంలో పలు సూచనలు చేశారు. మెరుగైన ఫలితాల కోసం ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని రాష్ట్ర స్థాయి శిక్షకులకు ఆయన సూచించారు. శిక్షణా కార్యక్రమాలకు సహకరిస్తున్న హోమిబాబా క్యాన్సర్ ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. హోమీబాబా క్యాన్సర్ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న అధునాతన పరికరాల్ని , ల్యాబులను ఆయన పరిశీలించి రాష్ట్ర స్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు.

3వ దశ శిక్షణ పూర్తయిన తర్వాత 3 రకాల క్యాన్సర్‌లపై ప్రత్యేక దృష్టి సారించే ఎన్సిడి 3.0 స్క్రీనింగ్ కార్యక్రమాన్ని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు మరియు ఎఎన్ఎంలు సంయుక్తంగా చేపట్టే ఇంటింటి సర్వే ద్వారా ప్రారంభిస్తారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్

Breast CancerCervical CancerCancerHealthGovernment Of Andhra PradeshTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News
Source / Credits

Best Web Hosting Provider In India 2024