39 నిమిషాల్లో ఆరోగ్యశ్రీ కార్డు

Best Web Hosting Provider In India 2024


39 నిమిషాల్లో ఆరోగ్యశ్రీ కార్డు

Best Web Hosting Provider In India 2024

శ్రీకాకుళం: ఆరోగ్య శ్రీ.. వేలాది ప్రాణాలకు కాపలా. లక్షలాది మంది సామాన్యులకు సంజీవని. వైయ‌స్ఆర్ నుంచి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభు త్వం వరకు అందరికీ మానస పుత్రిక. ఈ పథకం ఎందుకంత కీర్తి సంపాదించిందో మరో మారు నిరూపితమైంది. దీంతో పాటు ప్రభుత్వ చిత్తశుద్ధి కూడా అందరికీ తెలిసింది.

ఇచ్ఛాపురం పట్టణం ఫకీరుపేట వార్డు సచి వాలయానికి చెందిన వలంటీర్‌ వర్రి సింహాచలం సోమవారం ద్విచక్ర వాహనంపై జాతీయ రహదారిపై వెళ్తుండగా, మందస హైవేపై రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు, కుటుంబ సభ్యు లు సింహాచలంను విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

Best Web Hosting Provider In India 2024

సింహాచలంకు అంతవరకు ఆరోగ్యశ్రీ కార్డు లేకపోవడంతో ఉచితంగా చికిత్స చేయడం కుదరలేదు. అసలే వారిది పేద కుటుంబం.. సమయానికి చేతిలో డబ్బు లేకపోవడంతో బాధితుడి బంధువులు ఈ విషయాన్ని సీడాప్‌ చైర్మన్‌ సాడి శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి దృష్టికి తెచ్చారు.

యన తక్షణమే స్పందించి బాధితుని వివరాలు నమోదు చేసుకుని వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ అడిషనల్‌ సీఈఓకు ఫోన్‌ చేసి వివరాలు చెప్పారు. వెంటనే హెల్త్‌ కార్డు మంజూ రు చేయాలనికోరారు. మధ్యాహ్నం 1.53కు ఆయ న ఫోన్‌ చేస్తే కేవలం 39నిమిషాల్లో అంటే మధ్యా హ్నం 2.32కు ఆరోగ్య శ్రీ కార్డు రెడీ అయిపోయింది.

Best Web Hosting Provider In India 2024

ఆ కార్డు సాయంతో సింహాచలంకు సకాలంలో ఉచితంగానే కార్పొరేట్‌ వైద్యం చేయగలిగారు. సకాలంలో స్పందించి తమకు సాయం చేసిన ప్రభుత్వానికి సింహాచలం కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ‘వైయ‌స్ఆర్ ఆరోగ్యశ్రీ’ పథకం పేదలకు సంజీవని అని కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *