Best Web Hosting Provider In India 2024
Guppedantha Manasu Today Episode: వ్రతం పేరుతో వసుధారను ఇంటికి పిలిచి అవమానిస్తుంది దేవయాని. వసుధార కన్నీళ్లతో దేవయాని ఇంటి నుంచి తిరిగి రావడం చూసి అనుపమ, మహేంద్ర కంగారు పడతారు. ఏం జరిగింది, ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావని అడుగుతారు. శైలేంద్ర నిన్ను బెదిరించాడా? దేవయాని ఏమైనా అన్నదా? …లేదంటే రాజీవ్ ఎదురుపడ్డాడా అని ప్రశ్నల వర్షం కురిపిస్తారు.
అనుపమ, మహేంద్ర ఎంత అడిగిన వసుధార మాత్రం సమాధానం చెప్పదు. దేవయాని ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ధరణికి ఫోన్ చేస్తాడు మహేంద్ర. మేము ఎంత అడిగినా వసుధార ఏం చెప్పడం లేదని, అక్కడ ఏం జరిగిందో నువ్వైనా చెప్పమని ధరణిని కోరతాడు మహేంద్ర. వసుధారకు జరిగిన అవమానం గురించి మహేంద్రకు చెబుతుంది ధరణి.
మహేంద్ర ఆవేశం…
వసుధారకు అవమానం జరగడం మహేంద్ర భరించలేకపోతాడు. తన కోడలిని అవమానించిన వాళ్లకు బుద్ధి చెబుతానని ఆవేశంగా దేవయాని ఇంటికి బయలుదేరబోతాడు. అప్పుడే దేవయాని, శైలేంద్ర ఎదురుపడతారు. వారిని చూడగానే వసుధారను వ్రతానికి పిలిచి అవమానిస్తారా కొంచెం కూడా బుద్ది లేదా అని వారిపై మహేంద్ర ఫైర్ అవుతాడు.
మేమేం చేశామని శైలేంద్ర బుకాయిస్తాడు. మిమ్మల్ని మావాళ్లు అనుకున్నాం కాబట్టే మా ఇంట్లో చేసుకున్న వ్రతానికి మిమ్మల్ని పిలిచామని శైలేంద్ర బదులిస్తాడు. మీ నోరు తీపి చేయాలని వస్తే మమ్మల్ని బుద్దిలేదా అని అంటావా అని రివర్స్ మహేంద్రపై ఫైర్ అవుతాడు.
మీకు మేమేం శత్రువులం కాదని దేవయాని అంటుంది. తానేం వసుధారను అవమానించలేదని, తాను ఒక్క మాట కూడా అనలేదని దేవయాని అబద్ధం ఆడుతుంది. మీరే వెనకుండి ఈ డ్రామా ఆడించారని నాకు తెలుసునని మహేంద్ర ఆమె మాటలకు బదులిస్తాడు.
రిషి ఎక్కడున్నాడు…
రిషి ఎక్కడున్నాడో చెప్పమని మహేంద్ర, వసుధారలను అడుగుతుంది దేవయాని. రిషిని మూడు నెలల్లో తిరిగి తీసుకొస్తానని వసుధార చేసిన ఛాలెంజ్‌ను గుర్తుచేస్తుంది దేవయాని. ఆ మూడు నెలల గడువు పూర్తవ్వడానికి మరో వారం మాత్రమే గడువు ఉందని దేవయాని అంటుంది.
మను జపంలో వసుధార…
రిషి గురించి వెతకడం మానేసి మను జపం చేస్తున్నావని వసుధారపై దేవయాని ఫైర్ అవుతుంది. మను గురించి ఆలోచించి రిషిని మర్చిపోయావా అని అవమానిస్తుంది. మా కోడలి గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోనని మహేంద్ర ఆమెకు వార్నింగ్ ఇస్తాడు. అసలు నీకు కొంచెమైనా రిషి కనిపించడం లేదన్నా బాధ ఉందా?
మను రాకతో నువ్వు కూడా రిషిని మర్చిపోయావని మహేంద్రపై రివర్స్ ఎటాక్ చేస్తుంది దేవయాని. మను మీద మీరు పెట్టిన శ్రద్ధలో ఐదు శాతం రిషిని వెతకడంపై పెడితే వాడు ఎప్పుడో దొరికేవాడని మహేంద్ర, వసుధార మనసు నొచ్చుకునేలా మాట్లాడుతుంది దేవయాని.
డీబీఎస్‌టీ కాలేజీని వదిలేస్తా…
రిషి లేడని ఒప్పుకోమని వసుధారతో అంటుంది దేవయాని. రిషి బతికే ఉన్నాడని వసుధార బదులిస్తుంది. గడువు ముగిసే లోపు వారం రోజుల్లో రిషిని తీసుకొస్తావా అని వసుధారను అడుగుతుంది దేవయాని. తీసుకొస్తానని వసుధార ఛాలెంజ్ చేస్తుంది. గుడువు పూర్తయ్యేలోపు రిషిని తిరిగి తీసుకురాకపోతే డీబీఎస్‌టీ కాలేజీని వదలిపెడతానని నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడతావా అని అనుమానంగా వసుధారను ప్రశ్నిస్తుంది దేవయాని.
ఇచ్చిన మాటకే కట్టుబడి ఉంటానని, రిషిని వారం రోజుల్లో తీసుకురాకపోతే తాను కాలేజీ వదిలిపెట్టి వెళ్లిపోతానని వసుధార ఆమెకు ఆన్సర్ ఇస్తుంది. . వసుధార మాట ఇవ్వడం చూసి మహేంద్ర కంగారు పడతాడు. మాది రిషిధారల బంధం…మమ్మల్ని ఎవరూ వేరు చేయలేరని వసుధార బదులిస్తుంది. వసుధార నమ్మకం చూసి మహేంద్ర కూడా తన మాటే నా మా అని దేవయానికి చెబుతాడు.
జగతి స్థానంలో అనుపమ…
అనుపమను చూపిస్తూ ఆమె ఎవరు? తను ఇక్కడే ఎందుకు ఉంటుంది మహేంద్రను అడుగుతుంది దేవయాని. జగతి లేదు కాబట్టి ఆమె స్థానంలోకి అనుపమ వచ్చే ప్రయత్నాలు చేస్తుందా? అని అంటుంది. దేవయాని మాటలను అనుపమ తట్టుకోలేకపోతుంది.
ఇంకో మాట జారితే బాగుండదని దేవయానిని హెచ్చరిస్తుంది. ఆమె వార్నింగ్‌ను దేవయాని పట్టించుకోదు. మీ ఇద్దరి మధ్య ఉండే బంధాన్ని ఏమాంటారో తెలుసా…ఆ మాటను నా నోటితో చెప్పలేను. తలచుకుంటేనే అసహ్యంగా ఉంటుందని అంటుంది. మితిమీరి మాట్లాడొద్దు అని అనుపమ చెప్పిన దేవయాని పట్టించుకోదు. మీరు తప్పు చేసి నన్ను నిలదీస్తే ఎలా దేవయాని అంటుంది.
మను ఎంట్రీ…
నీకు పెళ్లి కాలేదు. ఓ కొడుకు ఉన్నాడు.ఆ కొడుకుకు తండ్రి ఎవరో తెలియదు. అసలు నీ లాంటి ఆడదాన్ని ఏమాంటారో తెలుసా అని దేవయాని అనబోతుండగా మను ఎక్కడికి ఎంట్రీ ఇస్తాడు. మా అమ్మను ఇంకో మాట అంటే ఊరుకోనని వార్నింగ్ ఇస్తాడు. అనుపమ మేడమ్‌ను అనే హక్కు మీకు లేదని అంటాడు. మరి మీ అమ్మకు ఇక్కడ ఉండటానికి ఏ హక్కు ఉందని శైలేంద్ర అంటాడు.
అసలు తను ఇక్కడ ఎందుకు ఉంటుందో నువ్వైనా చెప్పమని దేవయాని కూడా మనును అడుగుతుంది. కన్న తండ్రితో పాటు కన్న బిడ్డ ఉండగా అనుపమ ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముందని మనును నిలదీస్తుంది దేవయాని.
అది మా వ్యక్తిగతమని, ఇందులో జోక్యం చేసుకోవద్దని మను అంటాడు. మీ గొడవ గురించి లోకం అంత తెలుసు అని, ఇంకా ఇందులో పర్సనల్ ఏముద్దని దేవయాని ఎగతాళిగా మాట్లాడుతుంది. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.