Best Web Hosting Provider In India 2024
IRCTC Divya Dakshin Yatra Tour : దక్షిణ భారతదేశంలో దివ్య జ్యోతిర్లింగ క్షేత్రాలు దర్శించుకునేందుకు ఐఆర్సీటీసీ 9 రోజుల రైల్ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. సికింద్రాబాద్, విజయవాడ నుంచి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా తిరువణ్ణామలై(అరుణాచలం), రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు క్షేత్రాలను సందర్శించుకోవచ్చు. రూ.14250 ప్రారంభ ధరతో 9 రోజుల పర్యటనలో ఏడు ముఖ్యమైన తీర్థయాత్రలు చేయవచ్చు.
- పర్యటన వివరాలు : జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర – 8 రాత్రులు/9 రోజులు
- పర్యటన ప్రారంభ తేదీ : 22.06.2024
- ప్రయాణం : తిరువణ్ణామలై (అరుణాచలం) – రామేశ్వరం – మధురై – కన్యాకుమారి – త్రివేండ్రం – తిరుచ్చి – తంజావూరు
- సీట్ల సంఖ్య : 716 (SL: 460, 3AC: 206, 2AC: 50)
- బోర్డింగ్ / డీ-బోర్డింగ్ స్టేషన్లు: సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట
టూర్ ధర (ఒక్కో వ్యక్తి ధర):
క్లాస్ -పెద్దలకు -పిల్లలకు (5-11 సంవత్సరాలు)
- ఎకానమీ -రూ 14250/- -రూ 13250/-
- స్టాండర్ట్- రూ 21900/- -రూ 20700/-
- కంఫర్ట్- రూ 28450/– రూ 27010/-
- డే 1 : సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 12:00 గంటలకు రైలు బయలుదేరుతుంది. కాజీపేట(మధ్యాహ్నం 3.00) వరంగల్(3:25 గం), ఖమ్మం(5:40 గం), విజయవాడ(7:45 గం), తెనాలి(రాత్రి 9:00 గం), ఒంగోలు(11:15 గం) స్టేషన్లలో ప్రయాణికులు రైలు ఎక్కుతారు.
- డే 2 : నెల్లూరు(అర్ధరాత్రి 01:30 గం), గూడూరు(02:35 గం), రేణిగుంట(తెల్లవారుజామున 04:40 గం), ఉదయం 7 గంటలకు తిరువణ్ణామలై(అరుణాచలం) చేరుకుంటారు. అరుణాచలం రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత, ఫ్రెష్ అవ్వడానికి హోటల్ కు చేరుకుంటారు. ఆ తర్వాత అరుణాచలం ఆలయాన్ని దర్శించుకుంటారు. కుదల్‌నగర్‌కు వెళ్లేందుకు సాయంత్రం అరుణాచలం రైల్వే స్టేషన్‌లో డ్రాప్ చేస్తారు. రాత్రి 9 గంటలకు రైలు బయలుదేరుతుంది.
- డే 3 : కూడాల్‌నగర్ -రామేశ్వరం- ఉదయం 6.30 గంటలకు కూడాల్ నగర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. రోడ్డు మార్గంలో రామేశ్వరానికి చేరుకుంటారు. హోటల్‌లో చెక్ ఇన్ చేసి, ఫ్రెష్ అప్ అయిన తర్వాత రామేశ్వరంలోని దేవాలయాలను సందర్శి్స్తారు. రాత్రికి రామేశ్వరంలోనే బస ఉంటుంది.
- డే 4 : రామేశ్వరం – మధురై (కూడాల్‌నగర్) -తర్వాత రోజు మధ్యాహ్న భోజనం తర్వాత రామేశ్వరం నుంచి మధురైకి బస్సులో బయలుదేరతారు. మీనాక్షి అమ్మ వారి ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం స్థానికంగా షాపింగ్ చేయడానికి సమయం ఉంటుంది. కన్యాకుమారి వెళ్లేందుకు రాత్రి కూడాల్ నగర్ రైల్వే స్టేషన్‌లో డ్రాప్ చేస్తారు. రాత్రి 11.30 కు రైలు బయలుదేరుతుంది.
- డే 5 : ఉదయం 8 గంటలకు కొచ్చువేలి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కన్యాకుమారికి వెళ్తారు. హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. ఆ తర్వాత వివేకా రాక్ మెమోరియల్, గాంధీ మండపం, సన్‌సెట్ పాయింట్ టూర్ ఉంటుంది. రాత్రికి కన్యాకుమారిలోనే స్టే చేస్తారు.
- డే 6 : కన్యాకుమారి – కొచ్చువేలి – తిరుచ్చి-హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి, రోడ్డు మార్గంలో త్రివేండ్రం బయలుదేరి వెళ్తారు. త్రివేండ్రంలో అనంత పద్మనాభస్వామి దేవాలయం, మరియు కోవలం బీచ్ సందర్శిస్తారు. తిరుచిరాపల్లికి వెళ్లడానికి కొచ్చువేలి స్టేషన్‌లో రైలు ఎక్కుతారు.
- డే 7: తిరుచ్చి / తంజావూరు -ఉదయం 5 గంటలకు తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. హోటల్ చేరుకుని ఫ్రెష్ అయ్యి తర్వాత శ్రీరంగం ఆలయ దర్శనానికి వెళ్తారు. మధ్యాహ్న భోజనం తర్వాత రోడ్డు మార్గంలో తంజావూరు (60 కి.మీ.) వెళ్తారు. తంజావూరు బృహదీశ్వర దేవాలయాన్ని సందర్శించుకుంటారు. సికింద్రాబాద్ తిరుగు ప్రయాణం కోసం రాత్రి 11 గంటలకు తంజావూరులో రైలు ఎక్కుతారు.
- డే 8 : రేణిగుంట( ఉదయం 9:00 గం), గూడూరు(11:15 గం), నెల్లూరు(12:20 గం), ఒంగోలు(2:25 గం), తెనాలి(4:30 గం) , విజయవాడ (సాయంత్రం 5:35 గం) , ఖమ్మం(రాత్రి 7:50 గం), వరంగల్(10:10 గం) , కాజీపేట(11:45 గం) రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల డీబోర్డింగ్ ఉంటుంది.
- డే 9: తెల్లవారుజాము 2:30 గంటలకు రైలు సికింద్రాబాద్ చేరుకుంటుంది. దీంతో పర్యటన ముగుస్తుంది.
దక్షిణ భారత్ లోని జ్యోతిర్లింగ దివ్య క్షేత్రాల ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలు, బుకింగ్ కోసం ఈ కింద లింక్ పై క్లిక్ చేయండి.
https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCZBG25
సంబంధిత కథనం
టాపిక్
TourismAp TourismTourist PlacesIrctcIrctc PackagesTemples