కౌంటింగ్‌ సమయంలో వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి

Best Web Hosting Provider In India 2024

వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి  

అధికార యంత్రాంగంపై చంద్రబాబు పట్టుసాధించే ప్రయత్నం చేశారు

చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్నారు

ఏపీలో మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌కు సంతకం ఉంటే చాలని నిబంధనలు పెట్టారు

దేశంలో ఎక్కడా లేని నిబంధనలు కేవలం ఏపీలో మాత్రమే పెట్టారు

దేశమంతా ఒక నిబంధన, ఏపీలో మరో నిబంధన

కౌంటింగ్‌ ఏజెంట్లకు పార్టీ నేతల దిశానిర్దేశం

  తాడేపల్లి: కౌంటింగ్‌ సమయంలో వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. సోమవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కౌంటింగ్‌ ఏజెంట్లతో వైయస్‌ఆర్‌సీపీ కీలక నేతలు సమావేశం నిర్వహించారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. సమావేశంలో లేళ్ల అప్పిరెడ్డి, లీగల్‌ సెల్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.

స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఏమ‌న్నారంటే..
దేశమంతా ఒక నిబంధన.. ఏపీలో మరో నిబంధన. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌కు సంతకం ఉంటే చాలని నిబంధనలు పెట్టారు.  చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్నారు. అందరినీ భయపెడుతున్నారు. అధికార యంత్రాంగాల పట్ల పట్టు సాధించే ప్రయత్నాలూ చేశారు. ప్రతిపక్షాలు కుట్రలకు పాల్పడొచ్చు. అందుకే కౌంటింగ్‌ సమయంలో అప్రమత్తంగా ఉండాలి. కౌంటింగ్‌ పూర్తై డిక్లరేషన్‌ పూర్తయ్యే వరకు ఎవరూ బయటకి రావొద్దు. 

జాతీయ స్థాయిలో ఇచ్చిన ఎగ్జిట్‌పోల్స్‌ అన్నీ తప్పే. చంద్రబాబుకి బీజేపీతో పొత్తు లేకుంటే అలాంటి ఫలితాలు ఇచ్చుండేవారే కాదు అని సజ్జల పేర్కొన్నారు.

Best Web Hosting Provider In India 2024