Best Web Hosting Provider In India 2024
Mamitha Baiju: ప్రేమలు సినిమాతో మలయాళ హీరోయిన్ మమితా బైజూ చాలా పాపులర్ అయ్యారు. ఈ చిత్రంలో మమితా నటన, అందం, క్యూట్‍నెస్‍కు అందరూ ఫిదా అయ్యారు. ఈ చిత్రంతో నేషనల్ రేంజ్‍లో ఆమెకు క్రేజ్ వచ్చింది. చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. కాగా, మమితా బైజూ తాజాగా ఓ కమర్షియల్ ఈవెంట్‍కు వెళ్లగా ఆమెను చూసేందుకు అభిమానులు భారీస్థాయిలో ఎగబడ్డారు.
ఇదీ జరిగింది
చెన్నైలోని వీఆర్ మాల్‍లోని ఓ జువెలరీ షో ఈవెంట్‍కు మమితా బైజూ హాజరయ్యేందుకు వెళ్లారు. అయితే, ఆ సమయంలో ఆమెను చూసేందుకు వందలాది మంది అక్కడికి వచ్చారు. మమితా రాగానే ఒక్కసారి ముందుకు వచ్చేందుకు తోసుకున్నారు. ఆమెను చుట్టుముట్టారు. హఠాత్తుగా ఇలా జరగడంతో ఒక్కసారి మమితా కూడా హడలెత్తిపోయారు. కాస్త భయపడినట్టు కనిపించారు. బౌన్సర్లు, ఈవెంట్ నిర్వాహకులు జనాలను కట్టడి చేశారు. ఆ తర్వాత వెంటనే తేరుకొని నవ్వుతూ షోరూం లోపలికి వెళ్లారు మమితా.
మమితా బైజూను అభిమానులు చుట్టుముట్టిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే, ఆమెకు క్రేజ్ ఆ రేంజ్‍లో పెరిగిందని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
2017లో సవోపాలి పాలక్కరన్ అనే మలయాళ మూవీతో మమితా బైజూ తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత కూడా మలయాళ చిత్రాలు చేస్తూ వస్తున్నారు. కిలో మీటర్ అండ్ కిలోమీటర్స్, ఆపరేషన్ జావా, సూపర్ శరణ్య సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాది మార్చిలో రిలీజైన రెబల్ చిత్రంతో తమిళంలోనూ మమితా బైజూ అడుగుపెట్టారు.
ప్రేమలుతో ఫుల్ క్రేజ్
మలయాళ మూవీ ప్రేమలు ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన రిలీజైంది. ఈ చిత్రంలో నెస్లెన్ కే గఫూర్, మమితా బైజూ హీరోహీరోయిన్లుగా నటించారు. కేవలం రూ.5కోట్ల లోపు బడ్జెట్‍తోనే రూపొందిన ఈ చిత్రం రూ.130కోట్లకు పైగా కలెక్షన్లను దక్కించుకుంది. ఆ రేంజ్‍లో బ్లాక్‍బస్టర్ అయింది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించారు. ప్రేమలు మార్చిలో తెలుగులోనూ థియేటర్లలో రిలీజై మంచి కలెక్షన్లు దక్కించుకుంది. హైదరాబాద్ బ్యాక్‍డ్రాప్‍లో తెరకెక్కిన ప్రేమలు బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది.
అయితే, ప్రేమలు సినిమాతో మమితా బైజూ చాలా పాపులర్ అయ్యారు. ఆమె నటన, క్యూట్ ఎక్స్‌ప్రెషన్లు, స్మైల్ ప్రేక్షకులకు తెగనచ్చేశాయి. ప్రేమలులో మమితా సీన్లకు సంబంధించిన వీడియో బాగా వైరల్ అయ్యాయి. న్యూ క్రష్ అంటూ మమితాకు పేరొచ్చేసింది. మొత్తంగా ప్రేమలు సినిమా మమితా బైజూ ఫుల్ క్రేజ్ సంపాదించారు. చాలా మంది ఆమెకు అభిమానులు అయ్యారు.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రంలో మమితా బైజూను హీరోయిన్‍గా ఆలోచిస్తున్నారని జోరుగా రూమర్లు వచ్చాయి. ఈ చిత్రంతోనే ఆమె టాలీవుడ్‍లో అడుగుపెడతారని కూడా వినిపించింది. అయితే, ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. భాగ్యశ్రీ బోర్సేను చివరికి ఈ మూవీ కోసం తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ మూవీ కాకున్నా.. త్వరలోనే మమితా తెలుగులో అడుగుపెట్టే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి.