Best Web Hosting Provider In India 2024

వైయస్ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో-ఆర్డినేటర్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
విశాఖపట్నం: ఏపీలో ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్‌పోల్స్‌ను ఎవరూ పట్టించుకోవాల్సిన పనిలేదని, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయమని వైయస్ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో-ఆర్డినేటర్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారని చెప్పారు. సోమవారం వైయస్ఆర్‌సీపీ కౌంటింగ్ ఏజెంట్లతో వైవీ సుబ్బారెడ్డి జూమ్ మీటింగ్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా కౌంటింగ్ ప్రక్రియలో అనుసరించాల్సిన విధివిధానాలపై పలు సూచనలు చేశారు.
ఈ క్రమంలో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి. ఏజెంట్లు నిర్ణీత సమయం కంటే ముందుగానే కౌంటింగ్ సెంటర్లకు చేరుకోవాలన్నారు. ఏపీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్‌పోల్స్‌ను ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సర్వేల గురించి ఎవరూ ఆలోచించవద్దు. మహిళలు, వృద్ధులు మళ్లీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డే సీఎం కావాలని కోరుకున్నారు. వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులు అన్ని నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు.