Govt Cotton Seeds : 4, 5 రోజుల్లో పత్తి విత్తనాల సరఫరా, ప్రైవేట్ డీలర్ల వద్ద కొనుగోలు వద్దు- మంత్రి తుమ్మల

Best Web Hosting Provider In India 2024

Govt Cotton Seeds : గడిచిన రెండు మూడు రోజులుగా కురిసిన వర్షాలు, వచ్చే 3-4 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాలలో ఒక మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉందని వాతావరణశాఖ సూచించింది. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో మాట్లాడారు. అన్ని జిల్లాల కలెక్టర్లను వ్యవసాయ అధికారులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే అన్ని జిల్లాలకు సరఫరా చేసిన పచ్చరొట్ట, పత్తి విత్తనాల ప్యాకెట్లను రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అందజేసే విధంగా ఆదేశాలు ఇవ్వవల్సిందిగా కోరారు.

అందుబాటులో పత్తి విత్తనాలు

రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టికి 84,43,474 పత్తి విత్తనాల ప్యాకెట్లు సరఫరా చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటికే రైతులు 25,10,430 పత్తిప్యాకెట్లు కొనుగోలు చేశారన్నారు. కంపెనీల వారీగా సరఫరా సమీక్షించి, ప్రణాళిక ప్రకారం ఇంకా సరఫరా చేయాల్సిన పత్తి ప్యాకెట్లను కూడా రైతులకు మూడు రోజులలో అందుబాటులో ఉంచేటట్లు చూడాలని మంత్రి ఆదేశించారు. పచ్చిరొట్ట విత్తనాలు ఈ తేదీ నాటికి గత ఏడాదిలో 37959.60 క్వింటాలు రైతులు కొనుగోలు చేయగా, ఈ ఏడాది ఇప్పటికే 97,109 క్వింటాలు అందుబాటులో ఉంచగా, 84,412 క్వింటాళ్లు పచ్చిరొట్ట విత్తనాలను కొనుగోలు చేశారని అధికారులు తెలియజేశారు.

4-5 రోజుల్లో విత్తనాల సరఫరా

ప్రభుత్వం సరఫరా చేసే విత్తనాలను 4-5 రోజుల్లో రైతులకు అందుబాటులో ఉంచుతామని తెలియజేశారు. కొన్ని ప్రాంతాలలో పచ్చిరొట్ట విత్తనాలును ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి పక్కరాష్ట్రాలకు తరలిస్తున్నట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చిందన్నారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలను పణoగా పెట్టి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు.

ప్రైవేట్ వ్యక్తుల వద్ద విత్తనాలు కొనుగోలు వద్దు

అదేవిధంగా అనుమతి లేకుండా పత్తి విత్తనాల ప్యాకెట్లు విక్రయిస్తున్న 33 మందిపై కేసులు పెట్టి 200.49 లక్షల రూపాయల విలువగల 118.29 క్వింటాళ్ల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారని, బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారని ఇద్దరు డీలర్లపై కేసులు పెట్టినట్లు అధికారులు తెలిపారు. పత్తి విత్తనాలు మార్కెట్లలో అవసరంమేర అందుబాటులో ఉన్నాయని, రైతులందరు అధీకృత డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలని ప్రైవేట్ వ్యక్తుల వద్ద, మాయమాటలు చెప్పి అమ్మే వారి వద్ద విత్తనాలు కొనుగోలు చేయవద్దని రైతులకు మంత్రి విజ్ఞప్తి చేశారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్

FarmersTelangana NewsTelugu NewsSeedsTrending Telangana
Source / Credits

Best Web Hosting Provider In India 2024