Best Web Hosting Provider In India 2024
Actress Hema Arrest : బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ నటి హేమ అరెస్ట్ అయ్యారు. రేవ్ పార్టీ కేసులో హేమను బెంగళూరు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఇవాళ హైదరాబాద్ వచ్చిన బెంగళూరు సీసీబీ పోలీసులు… నటి హేమను అదుపులోనికి తీసుకున్నారు. రేపు హేమను కోర్టులో హాజరుపర్చనున్నారు పోలీసులు. గత నెల 20న బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో రెండు సార్లు హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తమ ముందు విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు ఇవ్వగా… అనారోగ్య కారణాలు చూపుతూ హేమ విచారణకు హాజరుకాలేదు. దీంతో పోలీసులు హైదరాబాద్ వచ్చి హేమను అరెస్టు చేశారు.
అసలేం జరిగింది?
గత నెల 20న బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్ పార్టీలో తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు పట్టుబడ్డారు. ఈ పార్టీకి టాలీవుడ్ నటి హేమ కూడా హాజరయ్యారు. ఈ పార్టీలో డ్రగ్స్ వినియోగించాలని పోలీసులు గుర్తించారు. పార్టీలో పాల్గొన్న వారి రక్తనమూనాలు సేకరించగా.. 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందని పోలీసులు తెలిపారు. పార్టీలో పాల్గొన్న 73 మంది పురుషుల్లో 59 మందికి, 30 మంది మహిళల్లో 27 మందికి డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిందని బెంగళూరు పోలీసులు పేర్కొన్నారు.
రేవ్ పార్టీలో లేనంటూ హేమ వీడియో
రేవ్ పార్టీ విషయం బయటకు రాగానే తాను హైదరాబాద్ లో ఉన్నట్లు హేమ కవర్ చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. అయితే హేమ ఫొటోను పోలీసులు విడుదల చేశారు. రేవ్ పార్టీలో ఆమె ఉన్నారని, హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పరీక్షలు నిర్థారణ అయిందని పోలీసులు తెలిపారు. రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న వారికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరవ్వాలని ఆదేశించారు. తనకు వైరల్ ఫీవర్ వచ్చిందని, కొద్దిరోజులు సయం కావాలని హేమ పోలీసులకు తెలిపారు. అయితే పోలీసులు కొంత సమయం ఇచ్చి రెండోసారి నోటీసులు ఇచ్చారు. అప్పటికీ హేమ విచారణకు హాజరుకాకపోవడంతో… ఇవాళ హైదరాబాద్ వచ్చిన పోలీసులు హేమను అరెస్టు చేసి బెంగళూరుకు తీసుకెళ్లారు.
సంబంధిత కథనం
టాపిక్