Guppedantha Manasu June 4th Episode: గుప్పెడంత మనసు- జగతి చావుపై నోరు జారిన శైలేంద్ర- రిషి రాకతో ముడిపడిన 6గురి జీవితాలు

Best Web Hosting Provider In India 2024

Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో తనకు తండ్రి తెలియదన్న విషయాన్ని పెద్ద అవమానంగా చెబుతుంది దేవయాని. ఇలా తండ్రి తెలియని వాళ్లు ప్రపంచంలో నువ్ ఒక్కడివే ఉండి ఉంటావని అంటుంది. నువ్ తండ్రి ఎవరో తెలియక పడరాని మాటలు పడుతున్నావ్. నీ తండ్రి ఎవరో తెలుసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావ్. కానీ, నో యూజ్. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పుడైనా నీ తండ్రి ఎవరో నీ తల్లిని చెప్పమని అడుగు అని దేవయాని అంటుంది.

 

కనిపెట్టి తీసుకొస్తాను

నా మాటలు నీకు కోపం తెప్పించొచ్చు. కానీ, నేను అనేది నిజం. నా బాధ, ఆవేదన తగ్గించేందుకే చెబుతున్నాను అని దేవయాని అంటే.. మను సైలెంట్‌గా ఉంటాడు. ఏ సమాధానం చెప్పదా.. ఇలాగైతే ఎలా నాన్నా.. నువ్ బతికినన్నాళ్లు ఇలా తండ్రి ఎవరో తెలియకుండా ఉండాల్సిందేనా అని దేవయాని అంటుంది. అవసరం లేదు. మను తండ్రి ఎవరో అనుపమ చెప్పకపోతే నేను ఎవరో కనిపెట్టి తీసుకొస్తాను అని మహేంద్ర అంటాడు.

నీకెందుకు మహేంద్ర. అనుపమ చెప్పనప్పుడు నీకెందుకు. వీళ్లమీద నీకెందుకు కన్సర్న్. మనుపై ఒక్కమాట పడనివ్వవు. కాలేజీలో మను తండ్రి అని చెప్పావ్. తర్వాత దత్తత తీసుకునేందుకు ప్రయత్నించావ్. అసలు నీ మనసులో ఏముంది. నేను నిన్ను ఒక్కటి అడుగుతాను చెబుతావా. నేను నిన్ను తిట్టానని ఇల్లు వదిలిపెట్టి వచ్చావా లేక అనుపమ ఇక్కడికీ వస్తుందని ముందే తెలిసి నాతో గొడవ పడి వచ్చావా అని దేవయాని అంటుంది.

అనుపమ ఫైర్

దాంతో వదినా గారు.. అని కోపంగా అరుస్తాడు మహేంద్ర. వదినా అనే ఒక్క మాట ఆపుతోంది. ప్లీజ్ దీన్ని ఇంతటితో ఆపేసేయండి అని మహేంద్ర అంటాడు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుసా. ప్రేమ, ఫ్రెండ్షిప్ గురించి మీకు ఏం తెలుసు. మా గురించి తెలిస్తే ఇలా మాట్లాడరు అని అనుపమ ఫైర్ అవుతుంది. వావ్.. వావ్.. సూపర్ అని దేవయాని క్లాప్స్ కొడుతుంది. మిమ్మల్ని అర్థం చేసుకోవాలా. ఏమని అర్థం చేసుకోవాలి. చెప్పండి అని రివర్స్‌గా అడుగుతుంది.

 

నీకు పెళ్లి కాలేదు. కానీ కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు తండ్రి ఎవరో చెప్పవు. వేరే వాళ్ల ఇంట్లో ఉంటావ్. కన్న కొడుకుని దూరం పెడతావ్ అని అనుపమను.. ఇక మీ అమ్మను నలుగురిలో బయటపెట్టవ్. నీ జన్మకు కారణం ఎవరో తెలియదు అని మనును, జగతి చనిపోయిందని మందుకు బానిస అయ్యావ్. ఎలాగోలా మానావ్. రిషిని తీసుకొస్తానంటావ్. కానీ ఏం చేయవు. ఎప్పుడు చూసిన మను, అనుపమ గురించే ఆలోచిస్తుంటావ్ అని మహేంద్రను అంటుంది దేవయాని.

ఇలాంటి వాళ్లను ఏమనుకోవాలి

ఇక నీ గురించి ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. రిషి నీకు ప్రాణం. మీది రిషిధారల బంధం అంటావ్. కానీ, నువ్ రిషి గురించి పక్కనపెట్టి అనవసర విషయాల్లో తలదూర్చుతున్నావ్. ఇలాంటి వాళ్లను ఏమనుకోవాలి అని దేవయాని అంటుంది. వారం రోజుల్లో రిషిని తీసుకొస్తానని వసుధార చెబుతోంది. మను తండ్రిని నేను కనిపెట్టి తీసుకొస్తానని చెప్పాను. ఓకేనా. ఇప్పటివరకు మీరు మాట్లాడింది చాలు. ఇక మీరు బయలుదేరండి అని మహేంద్ర అంటాడు.

హుమ్ బయలుదేరుతాం. ఈ ప్రసాదం ఇచ్చి బయలేదురుతాం అని వసుధారకు బలవంతగా ఇస్తుంది దేవయాని. ఇప్పటివరకు నువ్ ఆడుకున్నావ్ గా నేను ఆడుకుంటాను అని శైలేంద్ర అంటాడు. వారం రోజుల్లో రిషిని తీసుకురాకుంటే కాలేజీ నుంచి వెళ్లిపోతావా అని వసుధారను అడుగుతాడు శైలేంద్ర. వెళ్లిపోతాను అని వసుధార అంటుంది. అయితే నువ్ వెళ్లిపోడానికే రెడీగా ఉండు. అసలు వాడు ఉంటే కదా అని శైలేంద్ర అంటాడు.

 

మా మీద అనుమాన పడతావేంటీ

దాంతో కోపంతో శైలేంద్ర కాలర్ పట్టుకుంటుంది వసుధార. రిషి సార్‌ను ఏం చేశావ్ అని అడుగుతుంది వసుధార. ఏయ్.. వసుధార ముందు వదులు అని దేవయాని అంటుంది. ఏంటీ వసుధార నీకు పిచ్చి పట్టిందా ఇలా బిహేవ్ చేస్తున్నావ్ అని కాలర్ నుంచి చేయి తీసేస్తాడు శైలేంద్ర. నువ్ రిషి సార్‌ను ఏం చేయనప్పుడు ఇన్నిసార్లు రాడు లేదు అని ఎలా అంటావ్ అని వసుధార అంటుంది. మా మీద అనుమాన పడతావ్ ఏంటీ. వాన్ని మేము ఏం చేస్తాం. వాడు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం అని దేవయాని అంటుంది.

లేదు మీ గురించి నాకు బాగా తెలుసు. జగతి మేడమ్ ఇంటికి వచ్చాకా. కానీ, ఫంక్షన్ జరుగుతుండగా.. సడెన్‍గా చనిపోయారు. అంటే అక్కడ ఏదో జరిగిందని నా అనుమానం అని వసుధార అంటుంది. కొంపదీసి జ్యూస్‌లో విషం కలిపి మేమే ఇచ్చామని అనుకుంటున్నావా ఏంటీ అని శైలేంద్ర నిజం నోరు జారుతాడు. అంతా షాక్ అవుతారు. అలా నేను ఏం అనలేదే.. అంటే మీరే అలా చేశారా అని వసుధార అడుగుతుంటే.. అలా నేనేందుకు చేస్తాను అని శైలేంద్ర అంటాడు.

 

ఏదో ఆలోచిస్తున్నావ్

రేయ్ శైలేంద్ర అదే నిజమైతే నీ ప్రాణాలు తీస్తానురా. మీరొచ్చి మంచి పని చేశారు. ఇక నుంచి నేను జగతి చావుకు కారణమేంటో తెలుసుకుంటాను. అప్పుడు చెబుతాను మీ సంగతి. ఇప్పటికీ చాలా అడిగారు. ప్రతిదానికి సమాధానం చెబుతాను. ఇక బయలుదేరండి అని వార్నింగ్ ఇస్తాడు శైలేంద్ర. దాంతో ఇద్దరు వెళ్లిపోతారు. కట్ చేస్తే ఆ ఇంటి నుంచి వచ్చినప్పటి నుంచి ఏదో ఆలోచిస్తున్నావ్. ఏమైంది అని దేవయాని అడుగుతుంది.

మనం రచ్చ రచ్చ చేసి వచ్చాం కదా. ఇంతకీ మనం ఓడామా గెలిచామా అని శైలేంద్ర అడుగుతాడు. అదంతా పక్కనపెడితే మనం వాళ్లపై పైచేయి సాధించాం. రిషి లేడని అంటే తను ఉన్నాడని చెప్పింది వసుధార. రిషిని తీసుకురాకుంటే తను వెళ్లిపోతుంది. అప్పుడు లాభం ఎవరికీ. రిషిని తీసుకొస్తుందా లేదు. ఎందుకంటే వాడు లేడు రాడు. వారం రోజుల్లో వసుధార వెళ్లిపోతుంది. అంటే ఇప్పుడు ఎవరు గెలిచినట్లు అని దేవయాని అంటుంది. మనమే అని శైలేంద్ర అంటాడు.

తల్లి కాళ్లపై శైలేంద్ర

మను తండ్రి గురించి అడిగితే మహేంద్ర తీసుకొస్తాను అన్నాడు. వాడి తండ్రిని మహేంద్ర ఎలా తీసుకొస్తాడు. ఒకవేళ తీసుకొస్తే ఏం జరుగుతుంది. ఆ మను గాడు వాడి తండ్రిని అయినా చంపేస్తాడు. లేదా వాడి తండ్రిని మను గాడిని చంపేస్తాడు. అలా అయితే నష్టం జరిగేది మనుకే. ఇందులో గెలుపు ఎవరిది. మహేంద్రను అనుపమ ఎందుకు ఉంటుందని అడిగితే.. తడబడ్డాడు. కానీ, స్ట్రైట్‌గా సమాధానం చెప్పలేదు. వాళ్లు అలా ఉన్నారంటే ఏమనుకోవాలో తెలుసా అని దేవయాని వివరిస్తుంది.

 

మనమే గెలిచాం మామ్ అని దేవయాని కాళ్లకు నమస్కరిస్తాడు. నువ్ ఇంత గొప్పదానివని అర్థం చేసుకోలేకపోయాను. నన్ను ఆశీర్వదించు అని దేవయాని అంటుంది. నేను గొప్పదాన్ని కాబట్టే.. నువ్ ఫారెన్‌లో ఉన్నప్పుడు జగతిపైకి రిషి గాడిని ఉసిగొలిపాను. హద్దులు పెట్టి ఆడించాను. ఇప్పుడు వాడు కనిపించకపోయాడు కాబట్టి బతికిపోయాడు. లేకుంటే ఇంకా నా చేతిలో కీలుబొమ్మ అయ్యేవాడు. నువ్ వచ్చి అంతా కోపంగా ఏదేదో చేశావ్ మైండ్ లేదురా నీకు అని దేవయాని అంటుంది.

ఆరుగురి జీవితాలు

వాళ్లముందు వెర్రివాళ్లలా నిల్చున్నావ్. ఇక నుంచి నన్ను ఫాలో అవ్వు. మనకు కావాల్సింది ఫలితం. ఆ ఏండీ పదవిని ఎలా చేజిక్కుంచుకోవాలో ఆలోచించు. పరిస్థితులన్ని మనకు అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు నువ్ నాకు చెప్పకుండా ఏం చేయకు అని వార్నింగ్ ఇస్తుంది దేవయాని. కట్ చేస్తే రిషి ఫొటో పట్టుకుని వసుధార ఏడుస్తుంది. మరోవైపు తండ్రి గురించి మను, దేవయాని అన్నమాటలను తలుచుకుంటూ మహేంద్ర, అనుపమ ఆలోచిస్తుంటారు.

ఇలా నలుగురు ఎవరికి వారు మనసులో మాట్లాడుకుంటారు. అంతా రిషి రావాలని కోరుకుంటారు. రిషి వస్తాడు. నా కొడుకు నా దగ్గరికి వస్తాడని అనిపిస్తోంది. నేను మను తండ్రిని కనుక్కోలేకపోయినా రిషి కనుక్కుంటాడు. వాళ్లను ఒక్కటి చేస్తాడు అని మహేంద్ర అనుకుంటాడు. రిషితో ఉన్న మూమెంట్స్‌ను గుర్తు చేసుకుంటుంది వసుధార. మీరు జెంటిల్‌మెను ఐ లవ్యూ అని రిషికి ముద్దు పెడుతుంది వసుధార. రిషి రాకపై వసుధార, మహేంద్ర, అనుపమ, మను, శైలేంద్ర, దేవయాని ఆరుగురు జీవితాలు ఆధారపడి ఉన్నట్లు చూపించారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

 
IPL_Entry_Point
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024