Best Web Hosting Provider In India 2024
బెండకాయతో సాంబార్ ఎలా చేయాలో దాదాపు అందరికీ తెలుసు. ఫ్రై కూడా ఎలా చేయాలో చాలా మందికి తెలుసు. కానీ బెండకాయ మసాలా ఫ్రై ఎప్పుడైనా తిన్నారా? చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ బెండకాయ మసాలా ఫ్రై గురించి తెలుసుకుందాం. ఈ మసాలా వేపుడు అన్నంలోకి బాగుంటుంది. కొత్త రుచిని ఇస్తుంది.
భోజనంలో ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలను కొందరికి తినే అలవాటు ఉంటుంది. అలానే ఈ బెండకాయను కూడా ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు ఈ మసాలా ఫ్రైని ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలి అంటారు. అయితే ఈ బెండకాయ మసాలాను ఎలా వేయించాలి? దీన్ని తయారు చేయడానికి ఏ పదార్థాలు అవసరమో, రెసిపీ ఏంటో తెలుసుకుందాం.
బెండకాయ మసాలా ఫ్రైకి కావాల్సిన పదార్థాలు
బెండకాయ – 200 గ్రాములు, ఎండు మిరపకాయలు-4, వేరు శెనగ కొన్ని, శనగలు కొన్ని, కొత్తిమీర, జీలకర్ర, అల్లం కొంత, వెల్లుల్లి, పసుపు, నూనె, ఉ ప్పు, నెయ్యి కొద్దిగా,
బెండకాయ మసాలా తయారీ విధానం
ముందుగా బెండకాయను కడిగి గుడ్డలో ఆరబెట్టి చివర్లు కట్ చేసుకోవాలి. తర్వాత స్టౌ మీద ఒక పాత్ర పెట్టి అందులో నూనె వేయాలి. నూనె వేడయ్యాక అందులో వేరుశెనగ, శనగలు, ఉల్లి వేసి వేయించి, జీలకర్ర వేసుకోవాలి.
తరవాత అందులో ఎండు మిరియాలు వేసుకుని కలపాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో వేయాలి. మెత్తగా రుబ్బుకోవాలి. కావాలంటే కొద్దిగా నీరు పోయాలి.
పొడి పొడి అయ్యాక అందులో అల్లం, వెల్లుల్లి, ఉప్పు వేసి మళ్లీ మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మసాలాను ఒక గిన్నెలో వేయండి. ఇప్పుడు బెండకాయ తీసుకుని మధ్యలో చీల్చి దానిలోపల మసాలా దినుసులు వేయాలి. పైన కూడా అప్లై చేయాలి.
తర్వాత స్టౌ మీద ఒక పాత్ర పెట్టి అందులో నూనె వేయాలి. ఈ నూనెలో అన్ని మసాలా బెండకాయలను ఉంచండి. ఇది 2 నిమిషాలు ఉడికించాలి. తరువాత బెండను మరోవైపు తిప్పాలి. స్పైసీ టేస్ట్ తో బెండకాయ మసాలా ఫ్రై మీ ముందు సిద్ధంగా ఉంది. దీన్ని మధ్యాహ్న భోజనంలోకి, సాయంత్రం స్నాక్‌గా ఆస్వాదించవచ్చు.